అప్పుల్లో కూరుకుపోయిన ఎస్పీ బాలుని గట్టెక్కించింది ఎవరు ?

సుమారు తన కెరియర్ లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నాడు.

1966లో తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన బాలు శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే సినిమాతో తొలిసారిగా గాయకుడిగా తన ప్రస్తానాన్ని ఆరంభించాడు.

కేవలం గాయకుడిగానే కాదు.అనేక సినిమాల్లో నటుడిగా కూడా నటించి పాత్రలకి ప్రాణం పోశాడు.

అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, జెమినీ గణేషన్ లాంటి ప్రముఖ నటులందరికీ కూడా తన గాత్రాన్ని దానం చేశాడు.

పండిత పుత్రా పరమ శుంఠ అనే నానుడిని నిజం చేస్తూ బాలసుబ్రమణ్యం వంటి పండితుడికి చరణ్ అనే కుమారుడు ఉన్నాడు.

చరణ్ కాకుండా పల్లవి అనే కుమార్తె కూడా బాలుకి ఉంది.అయితే చరణ్ విషయంలో మాత్రం బాలసుబ్రమణ్యం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

తండ్రిని మించిన తనయుడుగా చరణ్ కి గాత్రాన్ని ఇచ్చిన ఆ దేవుడు అతనికి సక్సెస్ ని మాత్రం ఇవ్వలేకపోయాడు.

బాలుని సైతం ఇమిటేట్ చేయగల చరణ్ వాయిస్ తో సినిమాల్లో సక్సెస్ కాకపోయినా సరే ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవ్వాలని సినిమా నిర్మాణం చేపట్టాడు.

తొలుత ఉన్నై చరండింతెన్ అనే తమిళ సినిమాకి నిర్మాతగా మారగా, అది యావరేజ్ సినిమాగా పరవాలేదు అనిపించుకుంది.

ఆ తర్వాత మరొక ఐదు సినిమాలను నిర్మించడంతో బాలసుబ్రమణ్యం సంపాదించిన ఆస్తులు అన్నీ కూడా కరిగిపోయి అప్పుల పాలయ్యాడు కుమారుడి వల్ల.

"""/"/ ఇక గత్యంతరం లేని సమయంలో రామోజీరావు లాంటి వ్యక్తి బాలసుబ్రమణ్యం నీ పిలిపించుకొని తనకు పాడుతా తీయగా వంటి టెలివిజన్ ప్రోగ్రాం ని చేయాలని కోరగా తెలుగులోనే ది ఫస్ట్ రియాలిటీ షో గా అది నిలిచింది.

అంతేకాదు అమోఘమైన సక్సెస్ ని కూడా అందుకుంది దాంతో తిరిగి గాడిలో పడ్డాడు బాలు.

ఆ తర్వాత కొన్నాళ్ళకు తిరిగి కోలుకొని మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు.అలా కొడుకు వల్ల దెబ్బతిన్న బాలుని రామోజీరావు దగ్గర ఉండి కేవలం అతడి పైన ఉన్న గౌరవంతో కాపాడుకొచ్చాడు.

ఇక బాలు చనిపోయిన తర్వాత చరణ్ మళ్ళీ ఎక్కడ తప్పుదోవ పడతాడో అని భయపడ్డ రామోజీరావు అతడి కెరీర్ ని గాడిన వేసే పనిలో ఉండి, ప్రస్తుతం కొన్ని ప్రోగ్రాం ని హోస్ట్ చేయమని కోరాడు.

మాట వినాలంటున్న ‘హరి హర వీరమల్లు’.. పవన్ పాట విన్నారా?