హీరోయిన్ చీరలు ఐరన్ చేసే స్థాయి నుండి వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ఎవరంటే..?

కొంతమంది ఇండస్ట్రీ లోకి వచ్చేవారు చిన్న చిన్న పాత్రలు అలాగే లైట్ బాయ్ అసిస్టెంట్ డైరెక్టర్ వంటి పనులు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్స్ అవుతారు.

అలాంటి వారిలో ఇప్పటికే చాలామంది నటీనటులు ఉన్నారు.అయితే చాలామందికి తెలియని ఒక స్టార్ డైరెక్టర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు బాలీవుడ్ లో కొన్ని సినిమాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రోహిత్ శెట్టి.

రోహిత్ శెట్టి ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఆయన హీరోయిన్ టబు (Tabu) చీరలు ఐరన్ చేస్తూ ఉండేవారట.

ఇక ఆయన జీతం అప్పట్లో 35 వేలకు మించి ఉండేది కాదట. """/" / అలా ఇండస్ట్రీకి పరిచయమైన రోహిత్ శెట్టి ( Rohith Shetty ) ఆ తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ సినిమాలు హిట్ అవ్వడంతో మెల్లిగా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పుంజుకున్నారు.

ఇక ఈయన దర్శకత్వం వహించిన సూర్యవంశీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రోహిత్ శెట్టి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.

అలా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం రోహిత్ శెట్టి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.

"""/" / ఈయన ప్రస్తుతం ఏడాదికి 35 కోట్ల నుండి 45 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఆయన ఆస్తి విలువ దాదాపు 260 కోట్లకు పైగానే అని సమాచారం.

అయితే మొదట్లో ఈ డైరెక్టర్ హీరోయిన్ టబు ( Tabu ) చీరలు ఐరన్ చేసేవారు అని తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు ఎవరైనా సరే కింద స్థాయి నుండే పై స్థాయికి ఎదుగుతారు అని ఈయనపై పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక రోహిత్ శెట్టి ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారట.

ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా ఉన్న స్నేహితుడు ఆర్టిస్ట్.. ఈ నటుడిని గుర్తు పట్టారా?