Neha Shetty: 5 నిమిషాలు ఓర్చుకుంటే అయిపోతుంది కదా అని నేహా శెట్టిని బలవంతం చేసిన డైరెక్టర్.. ఎవరంటే..?

నేహ శెట్టి ( Neha Shetty ) ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు ఉన్న హీరోయిన్లలో నేహా శెట్టి కూడా ఒకరని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఈమె డిజె టిల్లు సినిమా ద్వారా తన రేంజ్ మార్చేసుకుంది.వరుస సినిమాల్లో చేస్తోంది.

ఇప్పటికే ఈమె నటించిన బెదురులంక 2012 ( Bedurulanka 2012 ) సినిమా సూపర్ హిట్ అయింది.

అలాగే ప్రస్తుతం ఈమె చేతిలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ వంటి రెండు సినిమాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా నేహ శెట్టి గురించి ఒక వార్త నెట్టింట్లో వినిపిస్తోంది.

అదేంటంటే ఆ డైరెక్టర్ నేహా శట్టిని ఐదు నిమిషాలు ఓర్చుకుంటే ఆ పని అయిపోయేది కదా అంటూ బలవంతం చేశారట.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.రూల్స్ రంజన్( Rules Ranjan ) సినిమాకి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ చేసిన సంగతి మనకు తెలిసిందే.

"""/" / అయితే ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో నేహశెట్టితో గొడవపడి దాదాపు మూడు నెలలు మాట్లాడలేదు అంటూ రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి కృష్ణ అసలు విషయం బయట పెట్టారు.

ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.రూల్స్ రంజన్ సినిమా సమయంలో నాకు నేహా శెట్టి కి పెద్ద గొడవ జరిగింది.

దాదాపు మూడు నెలలు మాట్లాడుకోలేదు.ఎందుకంటే ఈ సినిమాలో సమ్మోహనుడా సాంగ్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఈ సాంగ్లో నేహా శెట్టి స్విమ్మింగ్ ఫూల్ లో చేసిన డ్యాన్స్ మీరందరూ చూసే ఉంటారు.

అయితే ఈ స్విమ్మింగ్ ఫూల్ లో షూటింగ్ చేసేటప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ లోని వాటర్ 5 డిగ్రీల టెంపరేచర్ ఉన్నాయి.

దాంతో ఆ వాటర్ లోకి దిగితే హీరోయిన్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుగా వద్దన్నాను.

ఎందుకంటే ఆమెకు ఏదైనా ఇబ్బంది వస్తే మళ్లీ మీరే చేయమన్నారు అని తప్పు మొత్తం నా మీదకి నెట్టేస్తుంది.

దాంతో ముందు వద్దన్నాను.కానీ నేహ శెట్టి చేయను అని చెప్పిన కొద్దిసేపటికి మళ్ళీ ఆలోచించి చేస్తాను అని ఆ వాటర్ లోకి దిగింది.

ఇక ఆ వాటర్ మొత్తం క్లోరిన్ వాటర్ కావడంతో ఆమె కాళ్ళకి గాయం కూడా అయింది.

కానీ దాన్ని పట్టించుకోకుండా అందులో నేహాశెట్టి ( Neha Shetty ) ఉంది.

అయితే ఆ వాటర్ లో ఇబ్బంది పడుతూ ఇంకా ఎంతసేపు తొందర చేయండి అని అరిచింది.

కానీ చివరికి రెండు సీన్స్ తీస్తే షూట్ అయిపోయేది. """/" / కానీ టక్కున స్విమ్మింగ్ ఫూల్ నుండి బయటికి వచ్చేసింది.

దాంతో నేహాశెట్టి దగ్గరికి వెళ్లి ఎందుకలా చేసావ్ ఇంకో ఐదు నిమిషాలు ఓర్చుకుంటే ఇంకో రెండు సీన్లు అయిపోయేవి కదా సాంగ్ ఇంకా బాగా వచ్చేది అని నేను గొడవపడ్డాను.

కానీ దానికి కోప్పడ్డ నేహా శెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయి దాదాపు మూడు నెలలు ఇద్దరం మాట్లాడుకోలేదు.

కానీ ఈ పాట ఎడిటింగ్ చేసే సమయంలో పాపం ఈ హీరోయిన్ ఇంతలా ఇబ్బంది పడిందా అని నాకే అనిపించింది.

వెంటనే నేహశెట్టి కి ఫోన్ చేసి మాట్లాడాను అని డైరెక్టర్ జ్యోతి కృష్ణ ( Jyothikrishna ) ఆ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

అరుదైన ఘటన.. ఒకేసారి ఆరుగురు సోదరులు, సోదరీమణులు వివాహం