ఇంతకీ తెలుగు ఇండస్ట్రీ అసలు పెద్దన్న ఎవరు?
TeluguStop.com
ఇండస్ట్రీకి పెద్ద ఎవరు.ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.
ప్రేక్షకుల దగ్గర నుంచి సినీప్రముఖుల వరకు అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.మొన్నటి వరకు సినిమాల విడుదల గురించి చర్చించుకున్నారు ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్న దాని గురించి ఆలోచిస్తున్నారు.
మొన్నటి వరకు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనగానే ప్రేక్షకుల దగ్గర నుంచి సినీప్రముఖుల వరకు అందరూ ఠక్కున చెప్పే వారు మెగాస్టార్ చిరంజీవి అని.
కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటే నోరు మెదపడానికి కూడా భయపడిపోతున్నారు సినీ ప్రముఖులు.
కారణం మీరే ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి అంటూ ఇటీవలే కార్మికులు కోరిన సమయంలో.
నాకు అలాంటి పదవిపై ఆసక్తి లేదని.ఎలాంటి వివాదాలలోజోలికి పోవాలి అనుకోవట్లేదు అంటూ తెగేసి చెప్పేశారు మెగాస్టార్ చిరంజీవి.
ఇక అంతలోనే మంచు మోహన్ బాబు సైతం కేవలం నలుగురు హీరోలు నలుగురు నిర్మాతలు కలిసి సినిమా పరిశ్రమ కాదు అంటూ సంచలన స్టేట్మెంట్ విడుదల చేశారు.
దీంతో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్న వివాదం మరింత ముదిరింది.అయితే కరోనా వైరస్ క్రైసిస్ సమయంలో సినీ కార్మికులు అందరికీఅండగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి.
ఒకప్పుడు దాసరి నారాయణరావు 24క్రాఫ్ట్ లలో ఉన్న కార్మికులందరికీ ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించారు.
టాలీవుడ్ బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు నడిచారు.ఇక దాసరి మరణానంతరం ఆ బాధ్యతలు అన్నిటిని కూడా మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నట్లు గానే కనిపించింది.
"""/" /
కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించడం చేశారు చిరంజీవి.
కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఉపాధి లేక తినడానికి తిండి కూడా లేక ఆర్తనాదాలు చేస్తున్న ఎంతో మంది కార్మికులను ఆదుకునేందుకు ఏకంగా చారిటీ మొదలుపెట్టి ముందుండి నడిపించారు.
కార్మికులందరికీ నిత్యావసర సరుకులు అందించి కడుపు నింపారు.ఇలా ఇండస్ట్రీ పెద్ద బాధ్యతలు నిర్వహించిన చిరంజీవి మాత్రం మా ఎన్నికల కారణంగానే మనస్థాపం చెంది ఇక ఇండస్ట్రీకి పెద్ద అని అనిపించుకోవడం ఇష్టం లేదు అంటూ మనసులో మాట బయటపెట్టేశారు అన్నది తెలుస్తుంది.
కానీ చిరంజీవి ఎంతకాదన్నా ఆయనే ఇండస్ట్రీకి పెద్ద అని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
అయితే మరీ మెగాస్టార్ ఇండస్ట్రీలో పెద్ద అంటే టాలీవుడ్ పెద్దరాయుడు మోహన్ బాబు ఒప్పుకుంటాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
రానున్న రోజుల్లో ఎలాంటిచోటు చేసుకుంటాయన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా కుర్రాడిపై కాలు దువ్విన కోహ్లీ.. (వీడియో)