రంగస్థలంలో రామలక్ష్మి పాత్రని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే..?

సుకుమార్ సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి.కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక డిఫరెంట్ మేకింగ్ తో సినిమాని ఎంగేజ్ చేస్తూ నడిపించడం లో ఆయనది ఒక మాస్టర్ మైండ్ అనే చెప్పాలి.

ఆయన తీసిన ఫస్ట్ సినిమా నుండి మొన్న వచ్చిన పుష్ప దాక ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త విషయాన్నీ చెపుతూ ఉంటాడు అయితే ఆయన తీసిన రంగస్థలం సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి.

1980 టైం పిరియడ్ లో తెరకెక్కిన సినిమా కావడం తో అప్పటి మూడ్ లోకి మనల్ని తీసుకెళ్లిపోయారు అనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు హీరోగా రామ్ చరణ్ ఓకే కానీ ఆయన పక్కన రామలక్ష్మి పాత్రలో చేయడానికి ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు సుకుమార్ కి అనుపమ పరమేశ్వరన్ కనిపించారట ఆమె అయితే ఈ సినిమాలో రామ లక్ష్మి పాత్రకి కరెక్టుగా సరిపోతుందని అనుకొని ఆమెని అడిగితే కొన్ని కారణాల వల్ల తను ఆ సినిమా చేయలేకపోయింది.

దాంతో సుకుమార్ ఈ పాత్ర కోసం సమంత ని తీసుకున్నాడు.సమంత ఈ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించి మంచి పేరు తెచ్చుకుంది.

"""/"/ ఆ పాత్ర ని సమంత తప్ప ఎవ్వరూ చేసిన అంత బాగుండేది కాదు అనే రేంజ్ లో పేరు సంపాదించుకుంది.

సుకుమార్ లాంటి డైరెక్టర్ కూడా సమంత ఈ రోల్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది నేను మొదట వేరే వాళ్ళని అనుకున్నాను కానీ సమంత కోసమే పుట్టిన పాత్ర ఇది అని అన్నాడు.

ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు.

పుష్ప తో సాధించిన హిట్ ని పుష్ప 2 తో కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది.

రీసెంట్ గానే ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా షూట్ చేసినట్టు తెలుస్తుంది.

"""/"/ ఇది ఇలా ఉంటె సమంత కూడా శాకుంతలం అనే సినిమా చేస్తుంది ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది దీనికి గుణశేఖర్ డైరెక్టర్.

రీసెంట్ గా సుకుమార్ స్టోరీ అందించిన 18 పేజెస్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.ఈ సినిమా టైం లో కూడా అనుపమ మాట్లాడుతూ నేను రామలక్ష్మి పాత్రని మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

స్కూటీని అత్యంత తెలివిగా దొంగలించిన స్కూల్ గర్ల్.. వీడియో చూస్తే..?