ఎవరి భూమిని ఎవరు తీసుకుంటున్నారు.. చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్

ఏపీలో విపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై( Land Titling Act ) దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఎవరి భూమిని ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని మంత్రి బొత్స ప్రశ్నించారు.

చంద్రబాబు( Chandrababu ) తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.కావాలనే తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా విలువలు, నైతికతతో రాజకీయాలు చేయాలని సూచించారు.