Soniya Singh: ఎవరు ఈ సోనియా సింగ్.. నిన్న యూట్యూబ్.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్

సోనియా సింగ్.( Soniya Singh ) ఇప్పుడు ఎక్కడ చుసిన ఈమె పేరే వినిపిస్తుంది.

యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ ఫెమస్ అయినా సోనియా ఇప్పుడు విరూపాక్ష సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది.

ఆమె ఎక్కడ ఉంటె అక్కడ క్రేజ్ మాములుగా ఉండటం లేదు.యూట్యూబ్ లో వీడియోస్ చేయడం మానేస్తే సోనియా సింగ్ ఫ్యాన్స్ ఊరుకోలేదు.

బాంబే నుంచి వచ్చిన సోనియా మొదట హే పిల్ల అనే ఛానెల్ లో నటించింది.

అక్కడ ఫుల్ పాపులర్ అవ్వడం తో ఆమె గురించి సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు.

తెలిసి తెలియక ఆమె మాట్లాడే మాటలు ఫుల్ వైరల్ గా మారాయి.పైగా ఆమె మాట్లాడే డబల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఫుల్ పాపులర్.

ఇక యూట్యూబ్ లో ఇవే కాకుండా ఓయ్ పద్మావతి, పెళ్ళైన కొత్తలో, రౌడీ బేబీ అనే సిరీస్ లు కూడా చేసింది.

ఇక బుల్లి తెర కూడా అలీ హీరో గా నటించిన యమలీల సినిమాకు సీక్వెల్ గా యమలీల ఆ తర్వాత అనే సీరియల్ రాగా అందులో మెయిన్ లీడ్ గా నటించింది.

ఈ సీరియల్ కూడా మంచి విజయం సాధించింది. """/" / ఇక ఆ మధ్య బుల్లి తెర రియాలిటీ షో లో ఆమె పాల్గొని చేసిన సందడి అంత ఇంతా కాదు.

దాంతో ఏకంగా సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) నటించిన విరూపాక్ష సినిమాలో( Virupaksha Movie ) అవకాశం కొట్టేసింది.

ఈ చిత్రంలో ఆమె పాత్రా బాగానే ఉంది.ఇక ఇదే కాకుండా మరొక నాలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది సోనియా సింగ్.

ఈమె పవన్ అనే తన తోటి యూట్యూబర్ తో ప్రేమలో పడి సహజీవనం చేస్తుంది.

వీరిద్దరూ కలిసి నటించిన సిరీస్ లు అన్ని కూడా బాగా వ్యూస్ దక్కించుకున్నాయి.

"""/" / ఇక పోతే సోనియా సింగ్ ఎక్కడ ఉంటె అక్కడ సెన్సేషన్ అన్నట్టుగా తయారయ్యింది.

ఆమె విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తీరు బాగా వైరల్ అయ్యింది.

ఇలా ప్రతి ఒక్కరు ఆమె గురించి మాట్లాడుకోవడం తో ప్రస్తుతం ఎక్కడ విన్న కూడా సోనియా పేరు బాగా వినిపిస్తుంది.

ఇలాగే మరిన్ని సినిమాల్లో నటిస్తే ఆమె స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు.

ఇలా ఒక యూట్యూబ్ ద్వారా వచ్చిన చాల మంది అనేక రంగాల్లో స్థిరపడి పోతున్నారు.

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?