NTR : ఎన్టీఆర్ మరణానికి శంకర పిచ్చయ్య అనే వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి ?

శంకర పిచ్చయ్య( Sankara Picchayya ) .ఈ తరం వారికి ఈ పేరు అస్సలు తెలియదు.

కానీ సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి దగ్గరికి వస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఒక్కసారైనా శంకర పిచ్చయ్య పేరు తలుచుకోవాలనిపించింది.

అయన పేరు ఎన్టీఆర్ కన్నుమూసే వరకు అన్ని మీడియా సంస్థల్లో మాయూమ్రోగింది.వరసకు లక్ష్మి పార్వతికి సోదరుడు అవుతాడు ఈ శంకర పిచ్చయ్య.

ఎన్టీఆర్( NTR ) ని గద్దె దించాలంటే బలమైన అస్రం మీడియా.ఎదో ఒక బూచి చూపించి లేని భయాన్ని ప్రజల్లో కల్పించి ఎన్టీఆర్ ని గద్దె దించడం కోసం ఒక పత్రిక కంకణం కట్టుకొని మరి లక్ష్మి పార్వతి( Lakshmi Parvati ) మరియు శంకర పిచ్చయ్య లపై వరస కథనాలను ప్రచారం చేసింది.

"""/" / ఆ బూచి లక్ష్మి పార్వతి అయితే అందుకు బలయ్యింది శంకర పిచ్చయ్య.

లక్ష్మి పార్వతి చేతిలో పిల్లి పిల్ల కనిపించిన సరే అది ఒక డైనోసర్ పిల్ల అని అది తెచ్చింది శంకర పిచ్చయ్య అనే రేంజ్ లో అప్పట్లో వార్తలు వడ్డించబడ్డాయి.

ఆ దెబ్బకు, ఆ ప్రచార దాటికి తట్టుకోలేక బాబు మరియు మీడియా కూటమి చేసిన టార్చర్ కి ఎన్టీఆర్ బలైపోయాడు.

మీడియాలో శంకర పిచ్చయ్య వల్ల రాష్ట్రానికి ఎదో అయిపోతుంది అని, శంకర పిచ్చయ్య, లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ పంచన చేరి కుట్రలు చేస్తున్నారని రోజు పెద్ద పెద్ద వ్యాసాలు వచ్చేవి.

ఏవ్ నిజమనే భ్రమలో అందరు ఉండేవారు.శంకర పిచ్చయ్య చాల సార్లు నా గురించి చేదుగా రాయకండి అంటూ వేడుకున్న కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది.

"""/" / ఇక శంకర పిచ్చయ్య అంటే అప్పట్లో ఒక కిమ్ లాంటి వ్యక్తిగా ప్రజలకు చూపించారు.

ఇక ఎన్టీఆర్ మరణం వరకు ఇవి కొనసాగిన తన తండ్రి మరణం పై తనకు చాల అనుమానాలు ఉన్నాయని హరికృష్ణ తన భావ అయినా చంద్ర బాబు ని ఒక కమిటీ వేయించి మరి నిజం నిరూపించాలని కోరిన ఫలితం లేకపోవడం తో తన మంత్రి పదవికి రాజీనామా చేసాడు.

ఇక ఎన్టీఆర్ మరణం తో శంకర పిచ్చయ్య పై వార్తల ప్రసారం కూడా ఆగిపోయింది.

ఆలా ఒక మీడియా కక్ష కడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా ఎలాంటి గతి పడుతుందో అప్పట్లో అందరు కళ్లారా చూసారు.

డొక్కు కారులో ఫ్రెండ్స్ రోడ్డు ట్రిప్.. 2000 కి.మీ టార్గెట్.. కానీ..?