సప్తర్షులు, ప్రజాపతులు ఎవరు? వారి పేర్లు ఏమిటో తెలుసా?
TeluguStop.com
మన పురాణాలు, గ్రంథాల ప్రకారం సప్తర్షులు అంటే.ఏడుగురు దివ్య శక్తి గల తపస్సంపన్నులని అర్థం.
ఈ ఏడుగురు రుషులే ఏడు నక్షత్రాలుగా ఆకాశంల వెలుగుతున్నారని మత్య్స పురాణంలో వివరించారు.
వారెవరు వారి పేర్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.సప్తర్షుల్లో మొదటి వాడు మరీచి.
రెండో వాడు అత్రి.మూడో వాడు అంగీరస మహర్షి.
నాలుగోవాడు పులస్త్యుడు.ఐదో వాడు పులహుడు.
ఆరో వాడు క్రతువు.ఏడో వాడు వశిష్టుడు.
సృష్టి మొదలైన తర్వాత బ్రహ్మ దేవుడు తన సృష్టిని కొనసాగించేందుకు కొందరు అవసరమని భావించాడు.
వెంటనే తన మనస్సు నుంచి పది మంది ప్రజాపతులను తన శరీరం నుంచి సృష్టించాడు.
అలా మనస్సు నుండి పుట్టిన వారే ప్రజా పతులు.వారి పేర్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొదటి వాడు మరీచి.రెండో వాడు అత్రి.
మూడో వాడు అంగీరసుడు.నాలుగో వాడు పులహుడు.
ఐదో వాడు పులస్త్యుడు.ఆరో వాడు క్రతువు.
ఏడో వాడు వశిష్టుడు.ఎనిమిదో వాడు ప్రచేతసుడు.
తొమ్మిదో వాడు భృగు.పదో వాడు నారదుడు.
సప్తర్షుల్లోని కొంత మందే ప్రజా ప్రతులుగా కూడా పేరొందారు.వీరి వల్లే సృష్టి పెరిగింది.
అంతే కాదండోయ్ దీర్ఘాయువులు, వేద మంత్ర కర్తలు, దివ్య శక్తి సంపన్నులు, దివ్య దృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయో వృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ ఏడు గుణములు గల మహర్షులు సప్తర్షులుగా ప్రసిద్ధి చెందారు.
వీరి నుండే వంశాలు వృద్ధి చెందాయి.
వైరల్ వీడియో: పేదలపట్ల ఇలాంటి నీచమైన పని అవసరమా?