బింబిసారంగుడు ఎవరు ..? 500 ల మంది భార్యలా.. ?

బింబిసార.నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా పేరు.

ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పౌరాణిక అంశాల కలబోతగా సాగే ఈ సినిమా ద్వారా వశిష్ట్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ లుక్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇందులో శత్రుసైనిక సంహారం చేసి వారి శవాల గుట్టపై కూర్చొని ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు కల్యాణ్‌రామ్‌.

కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న పౌరాణిక చిత్రమిదని.కథా నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు వశిష్ట్‌ తెలిపారు.

విజువల్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌ ప్రధానంగా కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిదని నిర్మాత హరికృష్ణ వెల్లడించారు.

కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసినట్లు చెప్పారు.ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

కేథరిన్‌ ట్రెసా, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. """/"/ అటు ఈ సినిమా చారిత్రక చిత్రం కావడంతో ఈ బింబిసారుడు ఎవరు? అనే అసక్తి అందరిలో నెలకొంది.

మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజు బింబిసారుడు.క్రీ.

పూ 558లో జన్మించాడు.15 ఏళ్ల వయస్సులోనే సింహాసనాన్ని అధిష్టించాడు.

బింబిసారడుకు 500 మంది భార్యలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.బింబిసారుడు బుద్ధుడి సమకాలికుడిగా చారిత్రక ఆధారాలున్నాయి.

ముందెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్న కల్యాణ్ రామ్, లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్ తో లుక్స్ పరంగా మెప్పించాడు.

చిరంతన్ భట్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది.మోషన్ పోస్టర్ లో యూస్ చేసిన గ్రాఫిక్స్ లో కూడా క్వాలిటీ ఉంది.

ఇదే క్వాలిటీకి కంటెంట్ కూడా యాడ్ అయితే కల్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడినట్లే అవుతుందని సినిమా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అటు తన కెరీర్ లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని భావిస్తున్నాడట నందమూరి అబ్బాయి.

వైరల్ వీడియో: పెళ్లయితున్న ఆనందంలో రెచ్చిపోయిన పెళ్లి కుమారుడు..