టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లి పవర్‌స్టార్ కానున్న అకీరా..?
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక కొత్త తరం హీరోలు పరిచయం అవుతున్నారు.కొన్నేళ్ల క్రితం చిరంజీవి, నాగార్జున, నాగబాబు( Chiranjeevi, Nagarjuna, Nagababu ) వంటి సీనియర్ హీరోల కుమారులు హీరోలుగా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఇప్పుడు వారి తర్వాత తరం హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది.నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ ఈ హీరో తన ఫస్ట్ మూవీ ప్రకటించేశాడు.గతంలో కొంచెం బొద్దుగా ఉన్న ఈ నందమూరి అందగాడు ఇప్పుడు చాలా సన్నగా తయారయ్యి స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.
మహేష్ బాబు మేనల్లుడు, సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్ కూడా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు.
ఇప్పుడు యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్( Chandrahas ) సైతం సినిమాల్లో హీరోగా పరిచయమయ్యాడు.
"రామ్‌నగర్ బన్నీ" అనే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ఎంట్రీ ఇచ్చాడు ఈ ఆటిట్యూడ్ స్టార్.
ఇక రవితేజ కుమారుడు రాజా ది గ్రేట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఇంకా ఈ యువకుడు హీరో అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుందని చెప్పుకోవచ్చు.
చాలా రోజుల క్రితం మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ముద్దుల కుమారుడు గౌతమ్ 1: నేనొక్కడినే సినిమాతో నటించి మెప్పించాడు.
అతని ఎంట్రీ కూడా త్వరలోనే ఉంటుందని ఘట్టమనేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మహేష్ బాబుని రీప్లేస్ చేస్తాడని, అతనిలో మంచి నటుడు ఉన్నాడని కామెంట్లు కూడా చేస్తున్నారు.
గౌతమ్ ఎంట్రీ ఏమో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని సినిమా సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
"""/" /
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ తో చాలా బిజీ అయిపోయారు.
ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయడానికే ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు.ఆయన సినిమా రాక ఇప్పటికే ఎన్నో ఏళ్లు గడిచిపోయింది.
ఉన్న సినిమాలను కంప్లీట్ చేసి పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పినా చెప్పొచ్చు.
మరో వైపు చూస్తేనేమో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వీరాభిమానుల్లో అసంతృప్తి భారీగా పెరిగిపోతోంది.
ఈ సమయంలో పవన్ "సినిమాల్లో నేను లేని లోటును నువ్వే తీర్చాలి" అంటూ అకీరా నందన్‌ను( Akira Nandan ) అడిగారట.
అయితే అకీరా మాత్రం తాను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని, హీరో అవ్వనని స్పష్టం చేశాడట.
"""/" /
ఈ విషయం తెలిసిన చిరంజీవి, నాగబాబులు అకీరాను కూర్చోబెట్టి ముందుగా హీరోగా ఎంట్రీ ఇవ్వు అని కన్విన్స్ చేశారట.
అందుకు ఈస్టార్ కిడ్ ఒప్పుకోవడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది.పవన్ ఎలాగూ రాజకీయాల్లో బిజీ అయిపోయారు.
అందుకే నాగబాబు, చిరంజీవి ఇద్దరూ కలిసి అకీరాకి యాక్టింగ్‌లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట.హీరోకి కావాల్సిన అన్ని స్కిల్స్ పెంచుకోవడానికి బాగా హెల్ప్ చేస్తున్నారట.
అన్ని విషయాల్లో గైడెన్స్ ఇస్తూ మరొక బుల్లి పవర్‌స్టార్‌ని తయారు చేస్తున్నారని సమాచారం.
సినీ సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మాక్సిమం వచ్చే ఏడాది జనవరిలోగా అకిరా ఫస్ట్ మూవీ ప్రకటించడం, దాన్ని స్టార్ట్ చేయడం జరిగిపోతుందని తెలుస్తోంది.
కలెక్టర్లతో నేడు ,రేపు సదస్సు.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న బాబు