నేడు కాంగ్రెస్ లో ఎవరెవరు చేరుతున్నారంటే ..?

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో ఈ మధ్యకాలంలో చేరికల హుషారు కనిపిస్తోంది .

బీజేపీ , బీఆర్ఎ( BRS BJP ) స్ లలోని అసంతృప్త నేతలంతా కాంగ్రెస్ వైపు క్యూ కడుతుండడంతో,  ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది .

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు .

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఈ లిస్టును ఫైనల్ చేసే పనిలో ఉంది.మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో బీ ఆర్ ఎస్, బిజెపి( BRS BJP ) నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి క్యూ కట్టేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా బీఆర్ ఎస్ లో టికెట్ దక్కని నేతలు అంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపే ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది .

"""/" /  సిడబ్ల్యుసి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోనియా గాంధీ కీలకమైన ఆరు పథకాలను ప్రకటించింది .

మరోవైపు ఈ పథకాలను పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే.కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

ఇక ఈరోజు పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ( Rahul Gandhi )  మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge )సమక్షంలో భారీగా నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

వీరిలో ముఖ్యంగా నిన్న రాత్రి బి ఆర్ ఎస్ కు రాజీనామా చేసిన మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్,  ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ , ఆరేపల్లి మోహన్ తదితర నేతలు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు.

"""/" / మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ( Mainampalli Hanumanthrao )జైపూర్ నుంచి ఢిల్లీకి పైనమయ్యారు.

రాహుల్ గాంధీ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు.తనకు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినా,  తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం పెద్దలను కోరినా, టికెట్ నిరాకరించడంతో మైనంపల్లి అసంతృప్తితో నేడు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఇక ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు టికెట్ కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారు .

"""/" / దీంతో ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆమె మళ్ళీ తనకు టికెట్ కేటాయిస్తేనే పార్టీలో ఉంటానని ఇప్పటికే తేల్చి చెప్పారు.

ఆమెకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందడంతో ఆ పార్టీలో చేరుతున్నారు.ఇదేవిధంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ( Vemula Veeresam )కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఇదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది.

164 అడుగుల లోయలో పడిపోయిన ప్రెగ్నెంట్ టీచర్… చివరికేమైందో తెలిస్తే?