ANR NTR : సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లలో ఎవరు గొప్ప.. ఈ ప్రశ్నకు అభిమానుల జవాబు ఏంటంటే? 

ఇండస్ట్రీకి సీనియర్ దివంగత హీరోలు ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటివారు అని చెబుతూ ఉంటారు.

ఈ ఇద్దరు హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమను ముందుకు నడిపిస్తూ నేడు ఈ స్థాయిలో నిలబెట్టారని చెప్పాలి.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ స్థాయిలో ఉంది అంటే అందుకు కారణం ఎన్టీఆర్( NTR ) ఏఎన్నార్( ANR ) అనే చెప్పాలి.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సేవలను అందించినటువంటి ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం మన మధ్యన లేకపోయినప్పటికీ వారు నటించిన సినిమాల ద్వారా ఎప్పటికీ మనలోనే చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలుగా నటించినటువంటి ఈ హీరోల విషయంలో అభిమానులు మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు.

"""/" / తాజాగా ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడమే కాకుండా ఈయన మాట్లాడుతూ ఏఎన్ఆర్ చేసినటువంటి ఎన్నో గొప్ప సేవలు గురించి తెలిపారు.

ఇలా ఏఎన్ఆర్ గురించి వెంకయ్య నాయుడు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు ఏఎన్ఆర్ చివరి క్షణం వరకు సినిమాలకే పరిమితమై సినిమా ఇండస్ట్రీకి సేవలు చేశారని కానీ ఎన్టీఆర్ గారు మాత్రం మధ్యలోనే సినిమా ఇండస్ట్రీని వదిలి వేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ఇక ఈ సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలా ఇద్దరు హీరోల మధ్య పెద్ద ఎత్తున పోటీపడుతూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవలకు కూడా సై అంటున్నారు.

ఈ క్రమంలోనే ఏఎన్నార్ ఇండస్ట్రీకి నిజమైన నటుడు అని ఎన్టీఆర్ లాగా మధ్యలోనే రాజకీయాల కోసం ఈయన చిత్ర పరిశ్రమను వదిలి వెళ్ళలేదు అంటూ ఏఎన్ఆర్ అభిమానుల కామెంట్స్ చేయగా ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందిస్తూ మా హీరో ఇటు సినిమాల పరంగాను అటు రాజకీయాలలోనూ ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

కానీ మీ హీరోకి రాజకీయాలలో కొనసాగే స్టామినా లేకపోవడం వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు అంటూ ఏఎన్ఆర్ పట్ల కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఇద్దరిలో ఎవరు గొప్ప అనడం కాదు కానీ ఇద్దరు కూడా సమానమేనని వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటూ చిత్రపరిశ్రమ అభివృద్ధికి కారణమయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్రంప్ ఆ ప్లాన్‌ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!