గేమ్ ఛేంజర్ లీక్ వెనుక ఉన్నది వాళ్లేనా.. అడిగిన డబ్బు ఇవ్వలేదనే అలా చేశారా?

చరణ్( Ram Charan ) శంకర్( Shankar ) కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer Movie ) ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.అయితే గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైన రోజే ఆన్ లైన్ లో లీకై ఫ్యాన్స్ కు షాకిచ్చింది.

ఈ సినిమాకు సంబంధించిన హెచ్డీ ప్రింట్ లీక్ కావడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది.

గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కొంతమంది బెదిరింపులకు పాల్పడటంతో చిత్ర బృందం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.

తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ ను లీక్ చేస్తామని బెదిరించిన వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నారు.

సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలతో పాటు కొందరు కీలక వ్యక్తులకు వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా బెదిరింపు కాల్స్ వచ్చాయని చిత్ర బృందం ఫిర్యాదు చేసింది.

"""/" / మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందే కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని మూవీ రిలీజైన రోజే ఆన్ లైన్ లో లీక్ చేశారని 45 మందితో కూడిన ముఠాపై చిత్ర బృందం ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఈ ముఠా వెనుక ఉన్నది ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

"""/" / సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని అకౌంట్ల విషయంలో కూడా మేకర్స్ దర్యాప్తు చేసిందని సమాచారం అందుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేశాయి.

మీ అభిమానం చల్లగుండ.. ఒకే పోస్టర్ లో ఇన్ని వెరియేషన్స్!