మున్నూరు కాపు సంఘాన్ని తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు?
TeluguStop.com
ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన మున్నూరు కాపు( Munnuru Kapu Sangham ) పెద్దలుదుమాల శ్రీకాంత్ చేసిన తప్పిదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) కేంద్రంలో బి.
పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ జిల్లా మున్నూరు కాపు సంఘం మొత్తం భారత రాష్ట్ర సమితికి( BRS Tparty ) మద్దతు ఇస్తున్నమని ఏకగ్రీవ తీర్మానం చేసి ఇవ్వడాన్ని బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖండించడం జరిగింది.
సంఘం అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఉండాలి కానీ సంఘాన్ని తీసుకుపోయి ఒక పార్టీ దగ్గర తాకట్టు పెట్టడం సరైన విధానం కాదని అన్నారు.
మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి వెంకంపేట అధ్యక్షులు శీలం రాజు,గంభీరావుపేట మండల బిజెపి అధ్యక్షుడు గంట అశోక్ జిల్లాల మల్లేశం వెంకటాపూర్ ఉపసర్పంచ్ మేడిశెట్టి బాలయ్య మల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ గాండ్ల ఆంజనేయులు కొత్తపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ గాండ్ల రాజం వెంకన్న పత్యం ఆంజనేయులు ,మహేందర్ దేవయ్యలు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు.
దుమాల శ్రీకాంత్( Dumala Srikanth ) చేసిన తప్పిదాన్ని వెంటనే ఉపసంహరించుకొవలని రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేనియెడల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో మున్నూరు కాపు సంఘాలలోకి గ్రామాలలో ఉన్న సంఘాలలోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిరి శెట్టి తిరుపతి, వెంకంపేట అధ్యక్షులు శీలం రాజు, బిజెపి గంభీరావుపేట మండల అధ్యక్షుడు గంట అశోక్, జిల్లాల మల్లేశం, వెంకటాపూర్ ఉపసర్పంచ్ మేడిశెట్టి బాలయ్య,మల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ గాండ్ల ఆంజనేయులు, కొత్తపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ గాండ్ల రాజం, వెంకన్న, పత్యం ఆంజనేయులు, మహేందర్, దేవయ్య,సుమారు యాబై మంది మున్నూరు కాపు కుల పెద్దలు పాల్గొన్నారు.
బుల్లిరాజు రోల్ విమర్శలపై అనిల్ రావిపూడి సమాధానం ఇదే.. ఏం చెప్పారంటే?