తినుబండారాల కంపెనీకి పట్టణంలో పర్మిషన్ ఎవరిచ్చారు?

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్ లో జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన తిను బండారాల కర్మాగారానికీ పర్మిషన్ ఎవరిచ్చారు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కంపెనీ నుండి వెలువడే పొగ,వాసనతో కాలనీ వాసులకు ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓ బేకరీ వారు ఇల్లు అద్దెకు తీసుకుని వారం రోజుల క్రితంతిను బండారాల కర్మాగారం ఏర్పాటు చేశారని,నిత్యం పొయ్యిలో వంటలు చేస్తుండడంతో వాసన, పొగ కాలనీని కమ్మేసి చిన్నపిల్లలు,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నామని, జనావాసాల నుంచి అట్టి కర్మగారాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో భయం భయంగా బతకాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

అసలు జనావాసాల నడుమ ఇలాంటి తినుబండారాల కార్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు బేకరీ ఆహార పదార్థాల తయారీపై, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులపై,వారికున్న అనుమతులపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రీల్ కోసం రైలు కింద పడుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూస్తే షాక్!