పాపం.. కేజ్రీవాల్ ను ఎవరు నమ్మట్లేదా ?

డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్( Kejriwal ) పరిస్థితి ప్రస్తుతం పెన్నెం మీద నుంచి పోయిలో పడ్డాట్లైంది.

జాతీయ స్థాయిలో ఆప్ పార్టీని విస్తరింపజేయాలని చూస్తున్న కేజ్రీవాల్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

డిల్లీలో( Delhi ) మొదలై పంజాబ్ ను కైవసం చేసుకోని.ఇక భవిష్యత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party )ని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతూ వచ్చారు.

వారి నమ్మకానికి తగ్గట్లుగానే గుజరాత్, యూపీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టుకొని.జాతీయ పార్టీగా అవతరించింది ఆమ్ ఆద్మీ పార్టీ.

దాంతో వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయాలని కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తూ వచ్చారు.

ఇంతలోనే డిల్లీ లిక్కర్ స్కామ్ తో ఆప్ దూకుడుకి గట్టిగానే బ్రేకులు వేసింది మోడీ సర్కార్.

"""/" / ప్రస్తుతం ఈ స్కామ్ వల్ల ఆప్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఇప్పటికే ఈ కేసులో పలువురు ఆప్ నేతలు జైలు పాలు అయ్యారు.మరికొంత మంది కూడా లిస్ట్ లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుగన్న ఆప్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

ఈ స్కామ్ నుంచి బయటపడితే తప్పా.ఆప్ విస్తరణ జటిగేటట్లు కనిపించడం లేదు.

ఇదిలా ఉండగా వచ్చే ఆమ్ ఆద్మీ కి మద్దతుగా నిలిచే పార్టీలు కూడా దూరమవుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర పార్టీలను ఏకం చేసి మద్దతు కూడగట్టుకోవాలని చూసిన కేజ్రీవాల్ కు ప్రస్తుతం అన్నీ వైపుల నుంచి కూడా మద్దతు కరువైంది.

"""/" / 2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడేందుకు గత శనివారం కేజ్రీవాల్ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఏడుగురు ముఖ్యమంత్రులకు లేఖ రాశారట.

కానీ కేజ్రీవాల్ తో చర్చించేందుకు ఏ ముఖ్యమంత్రి కూడా హాజరుకాలేదని తెలుస్తోంది.ప్రస్తుతం లిక్కర్ స్కామ్ తో సతమతమౌతున్న ఆప్ తో కలిస్తే.

లేని సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించి ఉంటారని, అందుకే చర్చకు ఎవరు హాజరు కాకపోయి ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

మరోవైపు బెంగాల్ సి‌ఎం మమత బెనర్జీ( Mamata Banerjee ) కూడా బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర పార్టీలను ఏకం చేసే పనిలో ఉంది.

ఈ నేపథ్యంలో మమత బెనర్జీ, కేజ్రీవాల్ చేతులు కలుపుతారా ? లేదా మమతా బెనర్జీ కూడా కేజ్రీవాల్ ను నమ్మే పరిస్థితి లేదా అనే దానిపై కూడా పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి.

మొత్తానికి దేశ రాజకీయాల్లో రైజింగ్ పార్టీ గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ డిల్లీ లిక్కర్ స్కామ్ తో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది.

మరి దీని నుంచి ఆప్ ఎలా బయటపడుతుందో చూడాలి.

ఓరి దేవుడా.. కళ్ళు సీసాలో ప్రత్యక్షమైన కట్లపాము