కరోనా వైరస్ ఎప్పటికి వెళ్లిపోదు: డబ్ల్యూహెచ్ఓ

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన వైరస్ కరోనా.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది.

ఇంకా అలాంటి కరోనా వైరస్ కొన్ని లక్షలమంది ప్రాణాలను తీసింది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్ద ఛిన్నాభిన్నం అయ్యింది.

ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్ద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

కరోనా వైరస్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళదు అని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ పేర్కొన్నారు.

ఇంకా ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేకపోవడం, వ్యాధి నిరోధక శక్తి స్థాయి పెరిగేందుకు సుదీర్ఘ సమయం పట్టేలా ఉంది అని అభిప్రాయపడ్డారు.

''గతంలో వచ్చిన హెచ్ఐవీ ఇప్పటికీ తొలగిపోలేదు.వ్యాక్సిన్ రాలేదు కానీ మెరుగైన చికిత్స విధానం మాత్రం అందుబాటులోకి వచ్చింది.

కరోనా వైరస్ కూడా అంతేనని భావిస్తున్నాం.ఇది మానవాళిని అంటిపెట్టుకునే ఉంటుందనిపిస్తోంది" అని డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ పేర్కొన్నారు.

గిద్దలూరు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!