అప్పటివరకు కరోనా వ్యాక్సిన్ రాదు… ప్రజలకు డబ్ల్యూహెచ్ఓ షాక్?

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది.గడిచిన రెండు రోజులుగా దేశంలో 80,000కు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ కట్టడి కావడం లేదు.

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ను అదుపు చేయడం సాధ్యమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతుండగా పలు వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్, మరికొన్ని వ్యాక్సిన్లు రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి.

శాస్త్రవేత్తలు, ప్రజలు ఈ సంవత్సరం చివరినాటికి లేదా 2021 జనవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావించారు.

అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రజలకు షాక్ ఇచ్చింది.వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసి ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది.

కరోనా వ్యాక్సిన్ ముందుగానే అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ విసృతంగా అందుబాటులోకి రావడానికి వచ్చే సంవత్సరం జూన్ వరకు సమయం పడుతుందని ప్రకటించింది.

డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ వ్యాక్సిన్ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో తెలియాలంటే ఆ మాత్రం సమయం పడుతుందని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆలస్యమైతే అప్పటివరకు కరోనా చికిత్స కోసం మందులపై ఆధారపడటం మినహా మరో మార్గం లేదనే చెప్పాలి.

మరోవైపు గత కొన్ని రోజులుగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లోనే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

చాలా దేశాలలో 75 శాతం రికవరీ రేటుకు చేరుకున్న తరువాత కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంటే భారత్ లో మాత్రం భిన్నంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష