‘యువగళం’తో టీడీపీకి ఒరిగిందేంటి ?
TeluguStop.com
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర( Lokesh Yuvagalam )ను చేపట్టిన సంగతి తెలిసిందే.
గత ఏడాది జనవరి 27 న ప్రారంభం అయిన పాదయాత్ర ఇప్పటివరకు 226 రోజుల్లో మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగింది.
ఇక పాదయాత్రను ముగించేందుకు టిడిపి అధిష్టానం సిద్దమైంది.ఈ నెల 17 న ముగింపు సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికి, అనివార్య కారణాల వల్ల ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.
ఇకపోతే ఇన్ని రోజుల యువగళం పాదయాత్రతో టిడిపికి ఒరిగిందేంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
"""/" /
ఈ పాదయాత్ర టీడీపీకి ఎంతవరకు ప్లెస్ అయిందనే సంగతి అటుంచితే నారా లోకేశ్ కు మాత్రం ఈ పాదయాత్ర చాలానే మేలు చేసిందనేది కొందరి అభిప్రాయం.
గతంలో నారా లోకేశ్ పై ఎన్నో విమర్శలు చుట్టుముడుతూ వచ్చాయి.ఆయన అసలు రాజకీయాలకు పనికి రాడని, పరిణితి లేని పప్పు అని ఇలా ఎన్ని విమర్శలు వ్యక్తమౌతు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పార్టీలో కూడా లోకేశ్ నాయకత్వంపై అనుమానాలు పెరుగుతూ వచ్చాయి.ఈ సమయంలో యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) చేపట్టి తనను తను కొత్తగా పరిచయం చేసుకున్నారు లోకేశ్.
"""/" /
ప్రభుత్వ లోపలను ఎండగట్టడంలోనూ, ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడంలోనూ దూకుడు ప్రదర్శిస్తూ.
టీడీపీ( TDP ) క్యాడర్ లో కొత్త జోష్ నింపారు.ప్రజల్లో కూడా తనపై ఉన్న సందేహాలను పూర్తిగా తొలగించుకోవడంలో లోకేష్ సక్సస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మొత్తం మీద యువగళం పాదయాత్ర పార్టీకి ఎంతవరకు మేలు చేసిందనేది వచ్చే ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
కానీ లోకేష్ ను సరికొత్తగా పరిచయం చేయడంలో యువగళం పాదయాత్ర పార్టీకి చాలానే హెల్ప్ అయిందనేది చాలమంది అభిప్రాయం.
ఇక ఈ నెల 20న జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ఎన్నికలే లక్ష్యంగా పలు హామీలు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
మరి యువగళం పాదయాత్ర తరువాత నారా లోకేష్ ఇంకెలాంటి కార్యక్రమాలు చేపడతారో చూడాలి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మర్.. ఐశ్వర్య రాజేష్ క్రేజీ కామెంట్స్ వైరల్!