టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
TeluguStop.com
సినిమా ప్రపంచం రంగుల ప్రపంచం.అంతకు మించి మాయా ప్రపంచం కూడా.
ఇక్కడ ప్రేమలు, డేటింగ్ లు కామన్.ఎవరు ఎవరితో ఎప్పుడు కలిసి ఉంటారో.
ఎప్పుడు విడిపోతారో.ఎవరికీ తెలియదు.
మనుసులు కలిస్తే కలిసిపోతారు.లేదంటే విడిపోతారు.
ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో తెలుగు సినిమా పరిశ్రమే కాదు.ఏ ఇండస్ట్రీలోనూ పెద్ద పట్టింపులు ఏవీ లేదు.
అందుకే ఇవాళ ఒకరితో.రేపు మరొకరితో.
ఎల్లుండి ఇంకొకరితో.ఎప్పుడు ఎవరితోనైనా కలిసి ఉంటారు సినీ జనాలు.
ఈ గ్లామర్ లోకంలో ఆకర్షణ అనేది చాలా కామన్.ముఖ్యంగా పలు హీరోయిన్లు తమ తమ తొలి ప్రేమ గురించి పలు సార్లు వెల్లడించిన సందర్భాలున్నాయి.
హీరోయిన్లే కాదు.స్టార్ హీరోలకు సైతం ఫస్ట్ క్రష్ ఉంది.
ఇంతకీ వారు తొలిసారి ఎవరితో ప్రేమలో పడ్డారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
ఇంతకీ వారి ఫస్ట్ క్రష్ ఎవరితో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు సినిమ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబుకు ఫస్ట్ క్రష్ ఓ నటి మీద కలిగింది.
తను మరెవరో కాదు.హాలీవుడ్ బ్యూటీ డేమి మూర్.
తనంటే అప్పట్లో చాలా ఇష్టం అని చెప్పాడు.ఈ విషయాన్న స్వయంగా మహేష్ బాబే వెల్లడించాడు.
అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఫస్ట్ క్రష్ ఉందట.
తనకు చిన్నప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఎంతో ఇష్టమట.ఆమె నటించిన పలు సినిమాలను ఆయన చూసేవాడట.
"""/"/
అటు త్రిపుల్ ఆర్ సినిమాల హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిరుచులు సైతం ఒకేలా ఉన్నాయట.
ఇద్దరికీ అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట.ఆమె వీరిద్దరి ఫస్ట్ క్రష్ అట.
అటు బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా ఫస్ట్ క్రష్ ఉందట.
అయితే ఈయనది కాస్త వెరైటీ క్రష్.తాను చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్లో చదివాడు.
ఆ సయమంలో తన క్లాస్ టీచర్ అంటే విపరీతమైన క్రష్ ఉండేదట.ఓ సారి విషయం తెలిసి ప్రభాస్ ను మందలించిందట టీచర్.
అప్పటి నుంచి తను మారిపోయాడట.వీరే కాదు పలువురు హీరోలకు సైతం వెరైటీ క్రష్ లు ఉన్నాయి.
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?