చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ముగ్గురితో నటించిన హీరోయిన్స్ ఎవరంటే..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ వాళ్ల కన్న ఎక్కువ ఏజ్ ఉన్న హీరోలతో కూడా నటించాల్సి వస్తుంది.
ఇక్కడ హీరోయిన్స్ లైఫ్ చాలా తక్కువ గా ఉంటుందనే చెప్పాలి హీరోల కెరియర్ మాత్రం చాలా ఎక్కువ గా ఉంటుంది.
అందుకే వాళ్ళకి హీరోయిన్స్ దొరకడం కొంచం కష్టం అవుతుంది అనే చెప్పాలి.ఇక అలాంటప్పుడు హీరోయిన్స్ లో కొంచం ముదురు హీరోయిన్స్ ని వాళ్ల పక్కన పెట్టేసి సినిమాలు చేస్తుంటారు ఆ సినిమా దర్శక నిర్మాతలు.
అందుకే సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ కొడుకుతో నటిస్తుంది తండ్రి తోను నటిస్తుంది అలా మెగా ఫ్యామిలీ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్( Chiranjeevi, Pawan Kalyan, Ram Charan ) ముగ్గురితో నటించిన హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది కాజల్, తమన్నా( Kajal, Tamanna ) అనే చెప్పుకోవాలి.
కాజల్ రామ్ చరణ్ తో మగధీర,నాయక్ ( Magadheera, Nayak )సినిమాల్లో నటించగా,పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది.
"""/" /
అలాగే చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించి మెప్పించింది.
ఇలా తమన్నా కూడా చరణ్ తో రచ్చ సినిమాలో నటించింది,పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగ తో రాంబాబు సినిమాలో నటించింది, ఇక చిరంజీవితో సైర సినిమాలో నటించింది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తుంది.ఇలా ప్రస్తుతం అందరూ హీరోయిన్స్ అలానే నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు తెలుగు సినిమాల్లో ముఖ్యంగా హీరోయిన్, హీరో కాంబినేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తో ఫిల్మ్ మేకర్స్ అందుకే హీరోయిన్స్ ని ఎంపిక చేసుకునే విషయం లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారనే చెప్పాలి.
"""/" /
ఇక ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే హీరోయిన్స్ కి ఇక్కడ ఎక్కువ కెరియర్ ఉండదు అనే విషయం మనకు తెలిసిందే.
అయిన కూడా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఫేడ్ అవుట్ కాకుండా కెరియర్ ను కొనసాగిస్తున్నారు అంటే వాళ్ళకి సినిమా పట్ల ఎంత అంకితభావం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
వైరల్ వీడియో: పందెకోసం తయారు చేసిన కోడి చివరకు ఎక్కడికి చేరిందంటే?