దగ్గర పడుతున్న రుణమాఫీ గడువు… అర్హతలు ఇవేనా ?
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ సూపర్ సిక్స్( Congress Super Six ) పేరుతో 6 పథకాలను ప్రధానంగా ప్రకటించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రైతు రుణమాఫీ.( Farmers Loan Waiver ) తెలంగాణ లో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కూడా ప్రకటించారు.
ఇప్పుడు చూస్తే రుణ మాఫీ అమలు సమయం దగ్గర పడుతోంది.మరో రెండు నెలల్లో రైతు రుణమాఫీని అమలు చేయాల్సి ఉంటుంది.
అయితే దీనిని ఏ విధంగా అమలు చేస్తారు అనేది సవాల్ గా మారింది .
ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రైతు రుణమాఫీ విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
"""/" /
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయలేదని, రుణమాఫీని సక్రమంగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి , బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు( Harish Rao ) ప్రకటించారు.
తన రాజీనామా లేఖను అమరవీరుల స్థూపం వద్ద మీడియా మిత్రులకు కూడా అందించారు.
అయితే రాజీనామాకు హరీష్ రావు రెడీగా ఉండాలని, రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు.
దీంతో రైతు రుణమాఫీ విషయాన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గానే తీసుకున్నారు. """/" /
ఈ పథకం అమలు గడువు సమీపిస్తుండడం తో దీనిపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
రుణమాఫీకి అర్హులు ఎవరు ? దీనిని ఏ విధంగా అమలు చేయాలనే విషయం పైన దృష్టి సారించారు.
రుణమాఫీ పొందాలంటే కచ్చితంగా పట్టాదారు పాస్ బుక్ , రేషన్ కార్డు ఉండాలని నిబంధనను విధించారు.
దీంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు , ఆదాయపు పన్ను చెల్లించేవారికి రుణమాఫీ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఈ మేరకు అధికారులు విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పొందుతున్న వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…