వీరిలో కేంద్ర మంత్రి అయ్యేది ఎవరో ? 

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర క్యాబినెట్ ను ప్రక్షాళన చేయాలని ప్రధాని నరేంద్ర మోది భావిస్తున్నారు.

దీంతో పాటు త్వరలోనే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో,  కేంద్ర క్యాబినెట్ లో మార్పు చేర్పులు చేయడం ద్వారా,  ఆయా రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో బిజెపి అగ్ర నాయకులు ఉన్నారు.

ఈనెల 16 , 17 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ భేటీలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు, ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చే విషయం పైన చర్చించనున్నారు.

ముఖ్యంగా కర్ణాటక , తెలంగాణ,  మధ్యప్రదేశ్,  రాజస్థాన్ , చత్తీస్గఢ్ ఎన్నికల పై బిజెపి అధిష్టానం ఎక్కువగా ఫోకస్ పెట్టింది.

ముఖ్యంగా తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ అధిష్టానం ఉంది.         అందుకే తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న బండి సంజయ్ ధర్మపురి అరవింద్ , సోయం బాపూరావు, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన లక్ష్మణ్ లలో  ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా బిజెపిలో ప్రచారం జరుగుతుంది .

ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు.అయితే ఆయనను కొనసాగిస్తూనే మరో క్యాబినెట్ పదవిని తెలంగాణకు ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని లెక్కల్లో బిజెపి  పెద్దలు ఉన్నారట.

ఒకవేళ ప్రస్తుత తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కితే హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు బిజెపి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

    """/"/    అయితే మంత్రివర్గ రేసులో బండి సంజయ్ ధర్మపురి అరవింద్,  సోయం బాపూరావు లక్ష్మణ్ లు ఉండడంతో వీరిలో ఎవరికి ఆ అదృష్టం దక్కుపోతుందనేది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకురాగల సమర్థవంతమైన వ్యక్తికే ఈ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ బ్యూటీ.. మన దేశ సాంప్రదాయం పాటిస్తూ?