అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలి… డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఖండించిన శ్వేతసౌధం

2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమిని డోనాల్డ్ ట్రంప్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

నెలలు గడుస్తున్నా ఆయనను ఆ జ్ఞాపకాలు వదిలిపెట్టడం లేదు.ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అప్పట్లోనే ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలు చేశారు ట్రంప్.న్యాయస్థానాలు మొట్టికాయలు వేయడంతో చేసేదేం లేక శ్వేతసౌధాన్ని వీడారు.

అయితే ఆయన మద్ధతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంలో చేసిన రచ్చ అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచింది.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2020 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.

క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.అప్పటికే ట్రంప్ ఇచ్చిన పిలుపుతో వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.

భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్‌ సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

"""/"/ ఇదిలావుండగా.2020 అధ్యక్ష ఎన్నికలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు డోనాల్డ్ ట్రంప్.

తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టిన ఆయన.అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు.

తనకు వ్యతిరేకంగా బడా కంపెనీలు డెమొక్రాట్లకు మద్ధతుగా నిలిచాయని ట్రంప్ ఆరోపించారు.ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసిందని ఇటీవల ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.

దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు.అయితే రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఖండించింది.

ఈ మేరకు శ్వేతసౌధం అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్ ప్రకటన చేశారు.రాజ్యాంగం పవిత్రమైందన్న ఆయన.

2020 ఎన్నికలకు ముందు అమెరికా కాన్‌స్టిట్యూషన్‌లోని నిబంధనలను, నియమాలను రద్దు చేయాలనే ఆలోచన ట్రంప్‌కు వుండేదంటూ చురకలంటించారు.

ఆయనే రాజ్యాంగానికి పెద్ద శత్రువుని ఆండ్రూ బేట్స్ దుయ్యబట్టారు.

పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చెయ్యాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టరే బెస్ట్…