రాజీపడేది లేదు..వైట్ హౌస్ అధికారి ప్రకటన..???
TeluguStop.com
అమెరికా ప్రభుత్వం మూతపడుతోంది అంటూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ చేస్తున్నప్రకటనలని వైట్ హౌస్ కొట్టి పారేసింది.
ట్రంప్ కి ముందు చూపు లేదని అందుకే ఇంతటి సంక్షోభంలో అమెరికా ఉందని ప్రతిపక్షాల మాటలకి తీవ్ర అభ్యంతరం తెలిపింది.
అమెరికాలో షట్ డౌన్ వలన ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దాంతో అనేక మందికి పనిలేక వేతనాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు.
ఇదిలాఉంటే ఇప్పటికే సరిహద్దు గోడ గొడవ విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
అయితే ఈ పరిస్థితి తీరుని గమనించిన ట్రంప్ బుధవారం డెమోక్రాట్లు, రిపబ్లికన్‌లను అఖిలపక్ష సమావేశానికి పిలిచారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ సమావేశంలో అమెరికా భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం వైఖరిని చూపించే అవకాశం లేదని ఈ సమస్యకి త్వరలో పరిష్కారం దొరుకుతుందని.
వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి శారా సాండర్స్ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.