వైట్‌హౌస్‌లో కరోనా కలకలం: ఉద్యోగికి కోవిడ్, 3 రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి ప్రయాణం

వైట్‌హౌస్‌లో కరోనా కలకలం: ఉద్యోగికి కోవిడ్, 3 రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి ప్రయాణం

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కోవిడ్ కలకలం సృష్టించింది.జో బైడెన్‌ పాలనా యంత్రాంగంలో ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది.

వైట్‌హౌస్‌లో కరోనా కలకలం: ఉద్యోగికి కోవిడ్, 3 రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి ప్రయాణం

అతను మూడు రోజుల క్రితం అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి ప్రయాణించినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‌ సాకీ ఓ ప్రకటనలో తెలిపారు.

వైట్‌హౌస్‌లో కరోనా కలకలం: ఉద్యోగికి కోవిడ్, 3 రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి ప్రయాణం

ఆ ఉద్యోగి తరచూ అధ్యక్షుడికి కాంటాక్ట్‌లో ఉండరని.అయితే డిసెంబరు 17న మాత్రం దక్షిణ కరోలినా నుంచి ఫిలడెల్ఫియాకు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో బైడెన్‌తో పాటు ప్రయాణించారని జెన్‌సాకీ పేర్కొన్నారు.

ఆ సమయంలో‌నే బైడెన్‌ వద్ద దాదాపు 30 నిమిషాలు గడిపినట్లు ఆమె తెలిపారు.

సదరు ఉద్యోగికి కొవిడ్ పాజిటివ్‌ అని తేలగానే వైట్‌హౌస్ అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలోనే బైడెన్‌కు ఆదివారం యాంటీజెన్‌, సోమవారం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.ఈ రెండు టెస్టుల్లోనూ ఆయనకు నెగెటివ్‌ వచ్చినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

బుధవారం మరోసారి జో బైడెన్‌కు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.అయితే సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.

రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు కరోనా బాధితులతో కాంటాక్ట్‌‌లో వున్నప్పటికీ ఎలాంటి క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని జెన్‌ సాకీ తెలిపారు.

అందువల్లే జో బైడెన్ తన రోజువారీ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటారని వెల్లడించారు.వైట్‌హౌస్‌లోని సిబ్బంది రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్‌ డోసులు కూడా తీసుకున్నట్లు జెన్ సాకీ చెప్పారు.

"""/" / మరోవైపు అమెరికాలోనూ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది.టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఈ వేరియంట్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

అయితే దీనిని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది.బ్రిటన్ తర్వాత అమెరికాలోనూ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది.

న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్‌లో దీని తీవ్రత అధికంగా వుందని సీడీసీ తెలిపింది.థ్యాంక్స్ గివింగ్ జరిగిన నాటి నుంచి దేశంలో కరోనా కేసులు మళ్లీ తిరగబడుతున్నట్లుగా అభిప్రాయపడింది.

వింటర్ సీజన్ ప్రారంభమవ్వడం, ఈ వారం క్రిస్మస్ పర్వదినం కూడా వుండటంతో ఒమిక్రాన్ ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలోనే బూస్టర్ డోస్‌ పంపిణీపై అమెరికా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

బ్యాంకర్ టూ ప్రైమ్ మినిస్టర్‌.. కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ!