తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే ఉల్లి తొక్క‌లు..ఎలాగంటే?

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధిస్తున్న స‌మ‌స్య తెల్ల జుట్టు (వైట్ హెయిర్‌).

జుట్టు తెల్ల‌గా మార‌డం వ‌ల్ల అందం త‌గ్గ‌డ‌మే కాదు.మాన‌సికంగా కూడా కృంగిపోతుంటారు.

అందులోనూ చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు ఏర్ప‌డితే.వారి బాధ వ‌ర్ణనాతీతం.

పోష‌కాల లోపం, కాలుష్యం, కేశాల విష‌యంలో స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్‌, మ‌ద్య‌పానం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు తెల్లబ‌డుతుంది.

దీంతో ఏం చేయాలో తెలియ‌క‌.తెల్ల జుట్టును ఎలా న‌ల్ల‌గా మార్చుకోవాలో అర్థం గాక తెగ మ‌ద‌న ప‌డుతుంటారు.

అయితే ఎలాంటి చింతా చెంద‌కుండా.ఇంట్లోనే ఉల్లి తొక్క‌ల‌తో న్యాచుర‌ల్‌గా జ‌ట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని ఉల్లి తొక్క‌లు తీసుకుని.

మిక్సీలో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉల్లి తొక్క‌ల పొడిలో కొద్దిగా హెన్నా పొడి మ‌రియు వాట‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు మ‌రియు కేశాల‌కు ప‌ట్టించి.గంట త‌ర్వాత కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే.తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల బ‌డుతుంది.

"""/" / అలాగే ఒక గిన్నెలో వాట‌ర్ పోసి అందులో కొన్ని ఉల్లి తొక్క‌లు వేసి బాగా ఉడికించాలి.

ఇప్పుడు ఈ వాట‌ర్‌ను చ‌ల్ల‌గా మారిపోయిన త‌ర్వాత జుట్టుకు అప్లై చేసుకుని.అర గంట అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెడ్​ బాత్ చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.జుట్టు న‌ల్ల‌గా మార‌డంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది.

ఇక ఉల్లి తొక్క‌ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి.ఉద‌యాన్నే పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా క‌రివేపాకు పొడి క‌లిపి.త‌ల‌కు, శిరోజాల‌కు ప‌ట్టించాలి.

ముప్పై, న‌ల‌బై నిమిషాల త‌ర్వాత త‌ల స్నానం చేయాలి.ఇలా చేసినా కూడా వైట్ హెయిర్ బ్లాక్‌గా మారుతుంది.

బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మకు అలాంటి మెసేజ్ లు.. అతని అమ్మను ఇలా అంటే పరవాలేదా అంటూ?