విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!

భారత క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన అనంతరం, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నేరుగా చెన్నైకి వెళ్లిపోయాడు.

ఐపీఎల్ 2025 సమయం దగ్గర పడుతుండటంతో, జడేజా చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జడేజాకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఘన స్వాగతం పలికింది.

జడేజా ఐపీఎల్‌లో (Jadeja In The IPL)అడుగుపెట్టే ముందు పుష్ప రాజ్ స్టయిల్‌లో ఓ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అధికారిక పేజీలో "దళపతి జడ్డూ" అంటూ నెంబర్ 8 జెర్సీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.

అంతేకాదు, "వైల్డ్ ఫైర్" అంటూ జడేజాను పుష్ప రేంజ్‌లో చూపిస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

"సింహం డెన్‌లోకి వచ్చిందంటూ" ప్రత్యేక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది.2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించేందుకు కీలకపాత్ర పోషించిన జడేజా, విన్నింగ్ షాట్ కొట్టి భారత జట్టును గెలిపించాడు.

విజయంతో ఉత్సాహంగా, "ఇదీ నా బ్రాండ్" అంటూ పుష్పరాజ్ లా బ్యాట్‌ను వీపు మీద వేసుకుని స్టైల్‌గా సెలబ్రేట్ చేశాడు.

"తగ్గేదేలే" అంటూ సంబరాల్లో మునిగిపోయాడు. """/" / ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే జడేజా నేరుగా చెన్నైకి చేరుకున్నాడు.

సీఎస్కే క్యాంపులో చేరే క్రమంలో పుష్పరాజ్ రేంజ్‌లో స్టయిలిష్ ఎంట్రీ ఇచ్చాడు.గడ్డం కింద చేయి పెట్టి, భుజాన్ని పైకెత్తి, వీపు మీద అరచేయి పెట్టి, "ఇదీ జడ్డూ గాడి బ్రాండ్" అన్నట్టు స్టైల్‌గా స్టెప్ వేశాడు.

దీంతో CSK అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.గత సీజన్ అయిన ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది.

ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడిపోవడంతో క్వాలిఫైయర్‌కు చేరలేకపోయింది.అయితే ఈసారి మాత్రం టైటిల్ గెలవాలనే సంకల్పంతో చెన్నై బరిలోకి దిగుతోంది.

"""/" / ఈ సారి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టును బలంగా మార్చింది.

రవీంద్ర జడేజా లాంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్, ఎంఎస్ ధోనీ (A Top-class All-rounder Like Ravindra Jadeja, MS Dhoni)సమర్థమైన మార్గదర్శకత్వం ఉండటంతో, CSK అభిమానులు మరోసారి కప్ ఎత్తేందుకు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ కోసం జడ్డూ మ్యాజిక్ మరింత మెరుపులు మెరిపిస్తుందేమో చూడాలి.