అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా

నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు.దీనిలో భాగంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ హోటల్ సముదాయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలను జేసీబీ సాయంతో తొలగించారు.

నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్థలాన్ని నందకుమార్ లీజుకు తీసుకున్నారు.గతంలోనే నోటీసులు ఇచ్చినా స్పందించకుండా పనులు కొనసాగిస్తుండటంతో కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు కూల్చవద్దంటూ కోర్టు ఆర్డర్ ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు పాల్పడుతున్నారని నందకుమార్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కోర్టు ఆర్డర్ చూపించినా ఎలా కూలుస్తున్నారంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప‌చ్చి అల్లం తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?