వీడియో: హుండీ విరాళాలు లెక్కపెడుతూనే నోట్ల కట్టలు కాజేశారుగా..
TeluguStop.com
బెంగళూరులోని బైటరాయణపురలో ఉన్న గాలి ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.
ఈ స్వామి వారికి భక్తులు ఇచ్చిన వివరాలను(Donation ) అక్కడి అయ్యగార్లు దొంగతనం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఆలయంలోని డొనేషన్ మనీని లెక్కిస్తున్నారు.ఆ సమయంలో వారిలో ఒకరు రహస్యంగా మరొకరికి నోట్ల కట్టను ఇస్తున్నారు.
ఈ దృశ్యం చూసి భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో చూసిన భక్తులు తమ దాన ధర్మాలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడాలని భావిస్తున్నారు.
కానీ వారి డబ్బులను అక్కడి సిబ్బందే ఇలా మింగేస్తుంటే వారు చాలా బాధపడుతున్నారు.
తమ నమ్మకాన్ని ఇలాంటి ఘటనలు వమ్ము చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. """/" /
గాలి ఆంజనేయ స్వామి ఆలయంలో(Gaali Anjaneya Swamy Temple) జరిగిన దొంగతనం గురించి ఆలయ ముఖ్య పూజారి రామచంద్ర స్వామి మాట్లాడుతూ, ఈ సంఘటన ఒక సంవత్సరం క్రితం జరిగిందని చెప్పారు.
ఆ సమయంలోనే ఆలయం కఠిన చర్యలు తీసుకుందని, కమిటీలోని ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేసి, ఇద్దరు వంటవాళ్లను పని నుంచి తొలగించారని తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ఆలయంలో ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు విరాళాల డబ్బులను లెక్కించే పనిలో పాల్గొంటున్నారని తెలిపారు.
ఆలయం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటుందని, విరాళాల డబ్బులను సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
"""/" /
"ఆంజనేయ స్వామికి(Gaali Anjaneya Swamy Temple) దానం చేసేటప్పుడు ఎవరూ అనుమానించవద్దు.
ఎవరూ డబ్బులు దొంగతనం చేయలేరు" అని రామచంద్ర స్వామి భక్తులను ఓదార్చారు.ఆ ఆలయం దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోను ఇప్పటి వరకు 9,42,500 మంది చూశారు.దీనికి 10,000 లైక్‌లు వచ్చాయి.
అంతేకాకుండా చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్‌ల రూపంలో తెలియజేశారు. """/" /
కొంతమంది "పురోహితులు కూడా ఇందులో పాల్గొన్నారు" అని వ్యాఖ్యానించారు.
మరొకరు "ధోతి కట్టుకున్న ఆలయ సిబ్బంది దొంగతనం చేయడం చాలా దురదృష్టకరం.నిజాయితీ అనే గుణం లేకుండా వారు బ్రాహ్మణులమని చెప్పుకోవడానికి వీలు లేదు.
వారు మొత్తం సమాజానికి మచ్చ తెప్పించారు.వారిని పని నుండి తొలగించాలి" అని వ్యాఖ్యానించారు.
మరొకరు "ఎక్కడ చూసినా అవినీతి ఉంది.ఆలయాలను ప్రభుత్వం నిర్వహించాలి" అని కామెంట్ చేశారు.
లైఫ్ లాంగ్ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను.. యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!