మంత్రాలను జపించేటప్పుడు.. ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!
TeluguStop.com
సనాతన ధర్మంలో ప్రజలు ప్రతి రోజు పూజ చేస్తూ ఉంటారు.ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు చేసే పూజలో మంత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
మత గ్రంధాల ప్రకారం మంత్రాల ప్రభావం చాలా ప్రభావంతంగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.
మంత్రాల ప్రభావంతో గ్రహాల వ్యతిరేక స్థితి ప్రభావాన్ని తొలగించడం ద్వారా ఆనందం, శాంతి, విజయం సాధించవచ్చు.
మంత్రాలు జపించేటప్పుడు చాలామంది చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు.తప్పుగా మంత్రాలు( Mantras ) జపించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మంత్రాలు జపించేటప్పుడు మనం చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మీరు మంత్రాలు జపించడానికి ఉత్తమమైన సమయం ఉదయం, సాయంత్రం.
అంటే సూర్యోదయం( Sunrise ), సూర్యాస్తమయం.అయితే మీరు ఏ కారణం చేతనైనా రాత్రి పూట మంత్రాల నుంచి అసలు జపించకూడదు.
రాత్రి సమయంలో తంత్రానికి సంబంధించిన మంత్రాలు మాత్రమే జపిస్తారు. """/" /
అందుకోసం ఉదయం లేదా సాయంత్రం మాత్రమే దేవుని మంత్రం జపించాలి.
మంత్రాన్ని చదివే సమయాన్ని పదేపదే మార్చకూడదు.మీరు మంత్రం జపించే సమయాన్ని పదేపదే మారుస్తూ ఉంటే మీరు మంత్రాలను పాటించినా పూర్తి ఫలితాన్ని అస్సలు పొందలేరు.
ఈ కారణంగా నిర్ణీత సమయంలో మంత్రాన్ని పాటించాలి.మీరు మంత్రాన్ని జపించడం ప్రారంభించిన తర్వాత పదేపదే స్థలాన్ని కూడా మార్చకూడదు.
మంత్రాన్ని ఒకే చోట కూర్చొని జపించాలని గుర్తుపెట్టుకోవాలి. """/" /
మంత్రం చదివేటప్పుడు స్థలం మార్చి మంత్రాన్ని జపించడం వల్ల అసలు పుణ్యఫలం లభించదు.
అందుకోసమే మంత్రాన్ని జపించడం మొదలుపెట్టిన ప్రదేశం లోనే కూర్చొని మంత్రాన్ని జపించాలి.మంత్రం ప్రారంభించే ముందు పండితుడిని నుండి జపమాల గురించి సమాచారం తీసుకోవాలి.
తప్పుడు జపమాల ( Japamala )పట్టుకొని మంత్రాన్ని చూపించడం వల్ల పూర్తి పుణ్యఫలం లభించదు.
మీరు ఏ దేవుడిని జపిస్తున్నారో ఆ మంత్రం ఆధారంగా మీరు జపమాల ఎంచుకోవడం మంచిది.
అరెరే.. నోట్ల కట్టలను ఇలా కూడా లెక్కిస్తారా..? (వీడియో)