మాతృత్వం ప్రతి స్త్రీకి ఇదో పెద్ద వరం.అందుకే వివాహమైన ప్రతి మహిళ గర్భం దాల్చాలని తహ తహ లాడుతుంటుంది.
ఇక కోరుకున్నట్టుగానే గర్భం దాల్చితే.ఆ మహిళ ఎంత ఆనంద పడుతుందో మాటల్లో వర్ణించలేనిది.
అయితే పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.తీసుకునే ఆహారం, వేసుకునే బట్టలు, చేసే పనులు ఇలా అన్ని విషయాల్లోనూ ఎంతో శ్రద్ద వహించాయి.
అలాగే గర్భం దాల్చిన మహిళలు కొన్ని కొన్ని పనులకు కూడా దూరంగా ఉండాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చాలా మంది గర్భవతులు తెలిసో తెలియకో పెద్ద పెద్ద బరువున్న వస్తువులు, వాటర్ బకెట్లు ఎత్తేస్తుంటారు.
కానీ, ఇలా చేయడం వల్ల కండరాలు బలహీనంగా మారడం, పొట్ట సాగిపోవడం వంటి జరుగుతుంటాయి.
అలాగే కొందరు మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో బట్టలు ఉతకడం చేస్తుంటారు.కానీ, బేబీ బంప్ తో వంగుతూ, లేస్తూ బట్టలు ఉతకడం అనేది చాలా కష్టమైన పని.
"""/" /
ఇలా చేయడం వల్ల మీతో పాటు కడుపులోని బిడ్డ కూడా అసౌకర్యానికి గురవుతుంది.
కాబట్టి, ప్రెగ్రెన్సీ సమయంలో బట్టలు ఉతకడం మానుకోండి.అలాగే గర్భం ధరించిన తర్వాత కూడా చాలా మంది ఇల్లు తుడవడం, బాత్రూంలు కడగడం వంటివి చేస్తుంటారు.
కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు.ఎందుకూ అంటే ఇల్లు తుడవడానికి, బాత్రూంలు కడగడానికి వాడే లిక్విడ్స్‌లో పలు రకాల కెమికల్స్ ఉంటాయి.
అవి పిల్చితే కడుపులో బిడ్డకు హానికరంగా మారతాయి.ఇక వీటితో పాటు ఎక్కువ సమయం పాటు నిలబడటం, ఒకే చోటు గంటలు తరబడి కూర్చోవడం, మేకప్ ప్రోడెక్ట్స్ వాడటం, జుట్టుకు కలర్ వేసుకోవడం, ఆల్కహాల్ సేవించడం, స్మోకింగ్ చేయడం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.