నైట్ డిన్నర్ లో ఈ కూరగాయలను అస్సలు తినకూడదు.. తెలుసా?

సాధారణంగా మధ్యాహ్నం లంచ్ తో పోలిస్తే నైట్ తినే డిన్న‌ర్ చాలా లైట్ గా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.

ఎందుకంటే రాత్రుళ్లు మన శరీరం రెస్ట్ మోడ్ లో ఉంటుంది.ఫుడ్ హెవీగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై అధిక ప్రభావం పడుతుంది.

దాంతో మన నిద్రకు అనేక ఆటంకాలు కలుగుతాయి.అందుకే డిన్నర్ ను లైట్ గా చేయాలని అంటారు.

ఇకపోతే నైట్ డిన్నర్ లో కొన్ని కొన్ని కూరగాయలు అస్సలు తీసుకోకూడదు.మరి ఆ కూరగాయలు ఏంటి.

? వాటిని ఎందుకు తీసుకోకూడదు.? వంటి విషయాల్లో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనంలో టొమాటో( Tomato ) లేకుండా చూసుకోవాలి.టొమాటోలో ఆమ్ల కంటెంట్ అధికంగా ఉంటుంది.

ఇది ఎసిడిటికి కారణం అవుతుంది.బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, ఎన్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

అయితే రాత్రి భోజనంలో మాత్రం బ్రోకలీని పొరపాటున కూడా చేర్చవద్దు.బ్రోకలీలో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఇది రాత్రి నిద్రకు భంగం కలిగిస్తుంది.అంతేకాకుండా, ఉదయం గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు కూడా రావచ్చు.

"""/" / బఠానీలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి.అలాగే బఠానీలో పోషకాలు కూడా మెండుగా నిండి ఉంటాయి.

అయితే రాత్రివేళ బఠానీ తో తయారయ్యే కూరలు తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అందువ‌ల్ల రాత్రివేళ బ‌ఠానీ కూర‌ల‌కు దూరంగా ఉండండి. """/" / చిలగడదుంప( Sweet Potato ) చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్ ఇది.

అయితే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా నైట్ డిన్నర్ లో ఈ కూరగాయను తీసుకోకపోవడం ఉత్తమం.

ఎందుకంటే చిలగడదుంప లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.నైట్ చిలగడదుంప ని తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.కాబట్టి రాత్రి వేళ ఇటువంటి కూరగాయలు కాకుండా త్వరగా జీర్ణం అయ్యే కూరగాయలను తీసుకోండి.

రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. నేను మనుషులను ద్వేషిస్తున్నాను అందుకే..