ఎక్స్‌క్లూసివ్ : ఈ 22 ఆహారాల్లో గోమాత‌కు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

హిందువులు ఆవుల‌ను పవిత్ర‌మైన గోమాత‌లుగా భావించి వాటికి పూజ‌లు చేస్తార‌న్న విష‌యం తెలిసిందే.

ఆవును పూజిస్తే ఎంతో పుణ్యం వ‌స్తుంద‌ని న‌మ్ముతారు.అందులో భాగంగానే వారు పూజ‌లు చేస్తారు.

అయితే అలా ఎవ‌రైనా గోమాత‌ల‌కు పూజ‌లు చేసే స‌మ‌యంలో వాటికి కింద చెప్పిన విధంగా ప‌లు ప‌దార్థాల‌ను తినిపిస్తే దాంతో ఇంకా ఎంతో లాభాలు క‌లుగుతాయ‌ట‌.

ఆయా రకాల ఆహారాల‌ను గోమాత‌ల‌కు తినిపిస్తే వాటిని బ‌ట్టి ఫ‌లితాలు ఉంటాయ‌ట‌.మ‌రి గోమాత‌ల‌కు ఏయే ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.

1.గోమాత‌ల‌కు నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఆధ్యాత్మిక చింత‌న ల‌భిస్తుంద‌ట‌.

స‌న్మార్గంలో న‌డ‌వ‌వచ్చ‌ట‌.దైవ చింత‌న పెరుగుతుంద‌ట‌.

2.మీకు ఎవ‌రైనా శ‌త్రువులు ఉంటే గోమాత‌ల‌కు దోస‌కాయ‌ల‌ను పెట్టాల్సి ఉంటుంది.

దీంతో శ‌త్రు నివార‌ణ జ‌రుగుతుంది.3.

గోమాత‌ల‌కు బెండ‌కాయ‌ల‌ను తినిపిస్తే మ‌నోస్థైర్యం పెరుగుతుంది.ఏ ప‌ని చేయ‌డానికైనా కావ‌ల్సినంత ధైర్యం వ‌స్తుంది.

4.బాగా అప్పులు ఉన్న వారు నాన‌బెట్టిన కందుల‌ను గోమాత‌కు తినిపించాలి.

దీంతో రుణ విముక్తి చెందుతారు.5.

కుటుంబంలో క‌ల‌హాలు ఉన్న వారు, అస్త‌మానం కుటుంబంలో స‌భ్యుల‌తో గొడ‌వలు ప‌డుతూ ఉండేవారు గోమాత‌ల‌కు నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఫ‌లితం ఉంటుంది.

6.పిల్ల‌లు విద్యారంగంలో ఎద‌గాలంటే వారి త‌ల్లిదండ్రులు గోమాత‌ల‌కు నానబెట్టిన పొట్టు పెస‌ర ప‌ప్పును తినిపించాల్సి ఉంటుంది.

7.గోమాత‌కు నాన‌బెట్టిన ఛాయ పెస‌ర‌ప‌ప్పు పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుంది.

8.ఉద్యోగం రాకుండా ఉన్న‌వారు, దాని కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారు గోమాత‌కు గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలి.

9.ధ‌నం బాగా సంపాదించాల‌నుకునే వారు గోమాత‌కు మిన‌ప‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలి.

10.మాన‌సిక ప్ర‌శాంత‌త కావాల‌నుకునే వారు గోమాత‌కు దొండ‌కాయ‌లు పెట్టాలి.

11.గోమాత‌కు అర‌టి పండ్లు తినిపిస్తే ఉన్న‌త ప‌ద‌వి పొందుతారు.

12.సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాత‌కు వంకాయ‌ల‌ను తినిపిస్తే ఫ‌లితం ఉంటుంది.

13.వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాత‌కు క్యారెట్ల‌ను పెట్టాలి.

14.న‌ర ఘోష ఉన్న వారు గోమాత‌కు బంగాళా దుంప‌ల‌ను తినిపించాలి.

15.వివాహం కాని వారు గోమాత‌కు ట‌మాటాల‌ను పెట్టాలి.

16.గోమాత‌కు బీట్ రూట్‌, పాల‌కూర తినిపించినా ధ‌నవంతులు అవుతారు.

ఐశ్వ‌ర్య ప్రాప్తి క‌లుగుతుంది.17.

గోమాత‌కు నాన‌బెట్టిన మినుములు పెడితే ఆత్మ విశ్వాసం ల‌భిస్తుంది.18.

గోమాత‌కు నానబెట్టిన కందులు పెడితే కోపం త‌గ్గుతుంది.19.

తోట కూర‌, బెల్లం క‌లిపి గోమాత‌కు పెట్టినా మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పొంద‌వ‌చ్చు.20.

గోమాత‌కు నాన‌బెట్టిన గోధుమ‌లు పెడితే కీర్తి, ప‌ట్టుద‌ల ల‌భిస్తాయి.21.

నాన‌బెట్టిన బొబ్బ‌ట్లను గోమాత‌కు పెడితే ధ‌నాభివృద్ధి జ‌రుగుతుంది.22.

గోమాత‌కు నాన‌బెట్టిన ఉల‌వ‌లు పెడితే వృత్తిలో నిల‌క‌డ ల‌భిస్తుంది.

అల్లు అర్జున్ జైలు వెళ్ళడం పక్కనా..? జనవరి 10 వ తేదీన ఏం జరగబోతోంది..?