మనం అంటే భారతీయులు రోజుకు రెండు సార్లు భోజనం చేస్తుంటాం.ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, మళ్లీ రాత్రి కూడా భోజనం చేస్తుంటాం.
అలాగే మరికొన్ని ప్రాంతాల్లో రోజుకు మూడు సార్లు భోజనం చేస్తుంటారు.అయితే ప్రతి రోజు రెండు సార్లు భోజనము చేయాలని తైత్తిరియ బ్రాహ్మణం చెప్తోంది.
రెండు సార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుందట.
భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి.తూర్పు దిక్కుకి తిరిగి చేయటం వల్ల ఆయుష్షు పెరుగుతుందని కూడా తైత్తిరియ బ్రాహ్మణం వివరిస్తోంది.
అలాగే దక్షిణ దిశగా తిరిగి భోజనము చేస్తే కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి.ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి.
పడమర, దక్షిణం వైపున కూర్చని భోజనం చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి.కనుక తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం ఉత్తమం.
అలాగే ఆకులు, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు.డబ్బుని ఆశించే వాడు మట్టి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి.
సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకులో మాత్రమే భోజనం చేయాలి.భోజనానికి ముందూ, తర్వాత ఆచమనం చెయ్యాలి.
భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి.కానీ నియమాలను అనుసరించి కాకుండా ఎలా పడితే అలా తింటే.
అనేక రకాల సమస్యలు వస్తుంటాయి.అంటే ఆరోగ్య సమస్యలు కావొచ్చు లేదా వేరే ఇతర సమస్యలు కూడా కావొచ్చు.