మాస్క్ వాడేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేస్తే..రిస్క్ త‌ప్ప‌దు!

క‌రోనా వైర‌స్‌ ఫ‌స్ట్ వేవ్ కంటే సెకెండ్ వేవ్‌లో వేగంగా వ్యాప్తి చెందుతూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతోంది.

ఊహించిన దానికంటే స్పీడ్‌గా విజృంభిస్తున్న క‌రోనా ప్ర‌తి రోజు వేల మందిని బ‌లి తీసుకుంటుంది.

ఈ మాయ‌దారి వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే ముఖానికి మాస్క్ ధ‌రించ‌డ‌మే ఏకైక మార్గం.

అందుకే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, వైద్య నిపుణులు మాస్క్ ధ‌రించాల‌ని త‌ర‌చూ సూచ‌న‌లు చేస్తూనే ఉన్నారు.

అయితే మాస్క్ పెట్టుకోవ‌డం ఎంత ముఖ్య‌మో ఆ స‌మ‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించ‌డం కూడా అంతే ముఖ్యం.

నిజానికి మాస్క్ వాడేట‌ప్పుడు చేసే చిన్న చిన్న త‌ప్పుల కార‌ణంగా చాలా మంది రిస్క్‌లో ప‌డుతున్నారు.

మ‌రి ఆ త‌ప్పులు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.క‌రోనా సోక‌కుండా ఉండాలీ అంటే ఎప్పుడూ మూడు లేయ‌ర్లు ఉన్న మాస్క్‌నే వాడాలి.

కానీ, చాలా మంది ఒక లేయ‌ర్ ఉన్న మాస్క్‌నే వాడుతున్నారు.ఇలాంటివి పెట్టుకున్నా పెట్టుకోన‌ట్టే లెక్క‌.

కాబ‌ట్టి, కాస్త డ‌బ్బు ఖ‌ర్చు పెట్టైనా స‌రే మూడు లేయ‌ర్లు ఉండే మాస్కునే కొనుగోలు చేసి వాడండి.

లేదంటే ఇంట్లోనే త‌యారు చేసుకోండి. """/" / అలాగే మాస్క్ తీసిన త‌ర్వాత ఖ‌చ్చితంగా చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాలి.

లేదంటే మాస్క్‌కు అంటిపెట్టుకుని ఉంటే క్రిమి, కీట‌కాలు చేతుల‌కు అంటుకుని అపై నోరు, ముక్కు ద్వారా శ‌రీరంలోకి వెళ్లిపోతాయి.

మాస్క్ పెట్టుకున్న త‌ర్వాత చాలా మంది ఫోన్ మాట్లాడేందుకో, ఊపిరి ఆడ‌టం లేద‌నో త‌ర‌చూ గ‌డ్డం కింద‌కు లాగుతుంటారు.

కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లే ముందు మాస్క్ పెట్టుకుంటే తిరిగి ఇంటికి వ‌చ్చేవ‌ర‌కు మాస్క్‌ను తీయ‌రాదు.

ముక్కు, నోరు, గడ్డం భాగం పూర్తిగా క‌వ‌ర్ చేసే మాస్కుల‌నే ధ‌రించాలి.అలాగే ఒక‌సారి వాడిన మాస్క్‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వాడ‌రాదు.

ఒక సారి యూజ్ చేసిన మాస్క్‌ను.వేడి నీటిలో కొద్దిగా డెటాల్ వేసి అందులో వాష్ చేసుకుని ఆర‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత వాడుకోవాలి.ఇక ఒక‌వేళ మీ మాస్క్ చెమ‌ట కార‌ణంగా బాగా త‌డిచిపోతే.

వెంట‌నే దాన్ని తీసేసి మ‌రొక‌టి ధ‌రించాలి.లేదంటే చ‌ర్మంపై ఎల‌ర్జీలు, ద‌ద్దుర్లు వ‌చ్చేస్తాయి.

వాడిన మాస్క్‌ను అక్క‌డా ఇక్క‌డా కాకుండా డ‌స్ట్ బిన్‌లో వేయండి.

వేసవిలో సపోటాను ఇలా తీసుకున్నారంటే మీ బాడీలో వేడి మొత్తం ఆవిరైపోతుంది!