ఏడువారాలకు అధిపతులున్నారనే విషయం మీకు తెలుసా?

ఏడువారాలకు అధిపతులున్నారనే విషయం మీకు తెలుసా?

వారం అంటే ఏడు రోజుల సముదాయం.కాలగణనలో ఒకటైనా, ఏడైనా బేధం లేదు.

ఏడువారాలకు అధిపతులున్నారనే విషయం మీకు తెలుసా?

వారాధిపతులను తలచుకొని పూజించడం, వారి అనుగ్రహాన్ని కోరడం మానవ జీవనంలో శ్రేయఃకాంక్షకు నిదర్శనం.

ఏడువారాలకు అధిపతులున్నారనే విషయం మీకు తెలుసా?

ఏ వారమైతేనేమి అది శుభప్రదం కావాలని, క్షేమాన్ని కలిగించాలని మనిషి కోరుకుంటాడు.కాలగణనలో ముఖ్యపాత్ర వహించే వారాధిపతుల స్మరణ మానవాళి సుఖశాంతులకు దోహదం చేస్తుంది.

ఆదివారానికి అధిపతి సూర్యుడు.‘ఆది’ అంటే మొదటిది అని అర్థం.

ఉషస్సులో లోకానికి తొలుత కనిపించేవాడు సూర్యుడే కావున అతడే వారాధిపతి.సూర్యుడు లేకుంటే ఈ లోకం అంధకార బంధురమైపోతుంది.

 సోమవారానికి అధిపతి చంద్రుడు.సోముడంటే అమృతాన్ని పుట్టించేవాడు.

వెన్నెల అమృతంలాగే ఉంటుంది కాబట్టి చంద్రుడే అధిపతని జ్యోతిశ్య శాస్త్రం చెబుతోంది.చంద్రుడి వెన్నెల ఎన్నో ప్రాణప్రదాలైన ఔషధులను బతికిస్తోంది.

మంగళవారానికి అధిపతి కుజుడు.ఇతణ్ని అంగారకుడు అని  పిలుస్తారు.

కుజ’ శబ్దానికి భూమి నుంచి పుట్టినవాడు అనే అర్థం ఉంది.ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు.

మంగళం అంటే శుభం కాబట్టి.ఈ గ్రహాన్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

 బుధవారానికి అధిపతి బుధుడు.చంద్రుడి పుత్రుడిగా పురాణ ప్రసిద్ధి.

బుధుడు ఏ గ్రహంతో సన్నిహితంగా ఉంటాడో, ఆ గ్రహానికి సంబంధించిన గుణాలే బుధుణ్ని అంటుకుని ఉంటాయని జ్యోతీష్యం చెబుతుంది.

"""/" / గురువారానికి అధిపతి బృహస్పతి.  దేవతలకు గురువు అయిన కారణంగా బృహస్పతికి  గురువు అనేది ప్రసిద్ధనామం.

ఈ గ్రహ అనుగ్రహం ఉంటే సకల విద్యలూ సంప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు.సౌరమండలంలో అతి పెద్ద గ్రహం కూడా గురువు.

శుక్రవారానికి అధిపతి శుక్రాచార్యుడు.ఇతడు రాక్షసులకు గురువు.

నీతివేత్తల్లో అగ్రగణ్యుడు.మృత సంజీవని (మరణించిన వారిని బతికించే విద్య) తెలిసినవాడు.

  ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగేవాడు ఇతడు.వేగు చుక్కగా అందరూ ఇతణ్ని కొలుస్తారు.

శనివారానికి అధిపతి శనీశ్వరుడు.ఇతడి గమనం మెల్లగా ఉంటుంది.

ప్రాణుల పాప పుణ్యాలకు వెంటనే అనుగ్రహం చూపించే వాడిగా శనీశ్వరుడికి పేరుంది.ఇతడిని భక్తితో ఆరాధిస్తే చెడు తొలగిపోతుందని, మంచి జరుగుతుందని నమ్ముతారు జనం.

ఆ దేశంలో ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీ ఖాన్.. వాళ్లకు భారీ షాకిచ్చాడుగా!