పత్తి పంటకు ఏ దశలో ఏఏ తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయో తెలుసా..?
TeluguStop.com
పత్తి పంటను( Cotton Crop ) తెల్ల బంగారం గా పిలుస్తారు.ఎందుకంటే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి కూడా ఒకటి.
రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 20 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగు అవుతోంది.
పత్తి పంట సాగు చేయాలనుకుంటే ముందుగా సాగు విధానంపై అవగాహన కల్పించుకోవాలి.పత్తి పంటకు ఏ సమయాలలో ఎలాంటి తెగుళ్లు ఆశిస్తాయి.
ఆ తెగుళ్ల వల్ల( Pests ) పంటకు ఎంత మేరకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది.
ఆ తెగులను సకాలంలో ఎలా అరికట్టాలి అనే విషయాలపై అవగాహన ఉంటే ఏవైనా తెగుళ్లు ఆశిస్తే తొలి దశలోనే వాటిని అరికట్టి పంటను సంరక్షించుకోవచ్చు అని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.
"""/" /
పత్తి పంట కాయ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు పంటను ఆశిస్తాయి.
ముఖ్యంగా కాయ దశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడితే వివిధ రకాల శిలీంద్రాలు, ఫంగస్ ల ( Fungus ) రూపంలో తెగుళ్లు కాయలను ఆశించడం వల్ల కాయలు కుళ్ళిపోతాయి.
కొన్ని రకాల వైరస్ లు పత్తి కాయలలోకి( Cotton Seeds ) చేరి పత్తి పంట నాణ్యతను తగ్గిస్తాయి.
ఫంగస్ శిలీంద్రాలు పంటలు ఆశించడం వల్ల పత్తికాయలపై బూజును గమనించవచ్చు.అధిక తేమతో కూడిన వాతావరణం వల్ల ఈ తెగుల ఉధృతి పెరిగే అవకాశం కూడా ఉంది.
"""/" /
పత్తి పంటను సాగు చేసే రైతులు( Farmers ) పత్తి పంట కాయ దశలో ఉన్నప్పుడు ప్రతిరోజు పంటను గమనిస్తూ ఉండాలి.
అధిక వర్షాలు కురవడం లేదంటే వాతావరణంలో అధిక తేమ( Moisture ) ఏర్పడడం జరిగినప్పుడు కచ్చితంగా వివిధ తెగుళ్ళకు సంబంధించిన శిలింద్రాలు పత్తి కాయలను ఆశించే అవకాశం ఉంది.
అధిక వర్షాలు కురిస్తే వెంటనే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తీసుకుని తగిన రసాయన మందులను పిచికారి చేసి పంటను సంరక్షించుకోవాలి.
అప్పుడే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?