రాజశేఖర్ నటించిన 'అన్న' సినిమాతో పోటీపడి ఓడినా స్టార్ హీరోస్ సినిమాలు?

టాలీవుడ్ స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈయన నటించిన 'అన్న' సినిమాతో కొందరు స్టార్ హీరోస్ సినిమాలు పోటీపడి ఓడిపోయాయి.

ఇంతకూ ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.ఈయన తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి 1985లో వందేమాతరం సినిమాతో పరిచయమైయ్యాడు.

ఈ తొలి సినిమాతోనే ఈయన మంచి సక్సెస్ అందుకున్నాడు.దాంతో అదే ఏడాది ప్రతిఘటన సినిమాలో కూడా నటించాడు.

ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలతో తీరిక లేకుండా నటించాడు.ఇక ఈయన ఏ పాత్రకైనా ప్రాణం పోసేలా నటిస్తాడు.

క్లాస్ అయినా మాస్ అయినా అద్భుతంగా నటిస్తాడు రాజశేఖర్.ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించాడు.

తన నటనకు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి మంచి హిట్ లు సొంతం చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ఈయన నటించిన 'అన్న' సినిమా 1994 ఏప్రిల్ 7న విడుదలైన సంగతి తెలిసిందే.

"""/"/ ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.ఇందులో రాజశేఖర్ సరసన గౌతమి, రోజా హీరోయిన్స్ గా నటించారు.

ఈతరం ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ పై పోకూరి బాబూరావు ఈ సినిమాను నిర్మించాడు.

ఇక ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

దాంతో ఈ సినిమాను కన్నడ భాషలో కూడా రీమేక్ చేశారు. """/"/ అంతేకాకుండా ఈ సినిమాలో రాజశేఖర్ తన నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఘరానా అల్లుడు సినిమా విడుదల అయ్యింది.

కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక జగపతిబాబు, మీనా జంటగా కలిసి నటించిన సినిమా భలే పెళ్ళాం.

ఇక ఈ సినిమా అన్న సినిమా కంటే వారం రోజుల ముందు విడుదల అయింది.

"""/"/ కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.అదే సమయంలో నరేష్ నటించిన పెళ్లి కొడుకు సినిమా కూడా విడుదలైంది.

ఈ సినిమా కూడా ఫ్యామిలీ పరంగా, కామెడీ పరంగా బాగా ఆకట్టుకుంది.కానీ ఎందుకో అంత సక్సెస్ కాలేకపోయింది.

ఇక బాలయ్య నటించిన భైరవద్వీపం సినిమా కూడా అదే సమయంలో విడుదలైంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కానీ అదే సమయంలో అన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా ఉండటంతో రెండు సినిమాల ప్రభావం ఒకేలా ఉన్నాయి.

నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా కూడా అప్పుడే విడుదల కావటంతో మంచి హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మొత్తానికి రాజశేఖర్ సినిమాకు బాలయ్య, నాగార్జున కూడా కొంతవరకు పోటీపడినట్లు తెలిసింది.

రియల్ మీ P1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం.. డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..!