రొయ్యలు.. చేపలు.. ఈ రెండిటిలో ఏది బెస్టో తెలుసా?
TeluguStop.com
రొయ్యలు, చేపలు.నాన్ వెజ్ ప్రియులు సీ ఫుడ్‌లో అత్యధికంగా తీసుకునేది ఈ రెండిటినే.
అయితే ఈ రెండిటిలో ఏది ఇష్టం అంటే చాలా మంది రొయ్యలకే ఓటేస్తారు.
చేపలతో పోలిస్తే రొయ్యలు కాస్త ఎక్కువ టేస్ట్ ను కలిగి ఉంటాయి.ముల్లులు ఉండవు.
ఇక ఆరోగ్య పరంగా చూస్తే గనుక చేపల కంటే రొయ్యలే బెస్ట్ అంటున్నారు నిపుణులు.
చేపల కంటే రొయ్యల్లోనే పోషక విలువలు ఎక్కువగా.క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
అందు వల్లనే, రొయ్యలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా మెదడు పని తీరును చురుగ్గా మార్చి జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి.
అలాగే పురుషులు వారానికి రెండు సార్లు పచ్చి రొయ్యలను తీసుకుంటే.అందులో ఉండే జింక్, సెలీనియం వంటి పోషకాలు శృంగార సామర్థ్యాన్ని పెంచి సంతానలేమి సమస్యలను నివారిస్తాయి.