రొయ్య‌లు.. చేప‌లు.. ఈ రెండిటిలో ఏది బెస్టో తెలుసా?

రొయ్య‌లు, చేప‌లు.నాన్ వెజ్ ప్రియులు సీ ఫుడ్‌లో అత్య‌ధికంగా తీసుకునేది ఈ రెండిటినే.

అయితే ఈ రెండిటిలో ఏది ఇష్టం అంటే చాలా మంది రొయ్య‌ల‌కే ఓటేస్తారు.

చేప‌ల‌తో పోలిస్తే రొయ్య‌లు కాస్త ఎక్కువ టేస్ట్ ను క‌లిగి ఉంటాయి.ముల్లులు ఉండ‌వు.

ఇక ఆరోగ్య ప‌రంగా చూస్తే గ‌నుక చేప‌ల కంటే రొయ్య‌లే బెస్ట్ అంటున్నారు నిపుణులు.

చేప‌ల కంటే రొయ్య‌ల్లోనే పోష‌క విలువ‌లు ఎక్కువ‌గా.క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.

అందు వ‌ల్ల‌నే, రొయ్య‌లు ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా మెద‌డు ప‌ని తీరును చురుగ్గా మార్చి జ్ఞాప‌క శ‌క్తిని రెట్టింపు చేయ‌డంలో రొయ్య‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాగే పురుషులు వారానికి రెండు సార్లు ప‌చ్చి రొయ్య‌ల‌ను తీసుకుంటే.అందులో ఉండే జింక్, సెలీనియం వంటి పోష‌కాలు శృంగార సామర్థ్యాన్ని పెంచి సంతానలేమి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి.

బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నవారు త‌మ డైట్‌లో రొయ్య‌ల‌ను చేర్చుకుంటే.సూప‌ర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.

"""/" / రొయ్య‌ల్లో విట‌మిన్ ఇ పుష్క‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల‌, త‌ర‌చూ రొయ్య‌ల‌ను తీసుకుంటే చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.

వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా ద‌రి చేర‌కుండా ఉంటాయి. """/" / అంతే కాదండోయ్‌.

వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు రొయ్య‌ల‌ను తింటే థైరాయిడ్ గ్రంధి సక్ర‌మంగా ప‌ని చేస్తుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.ఎముక‌లు బ‌లంగా మార‌తాయి.

మ‌రియు రొయ్య‌ల్లో ఉండే ప‌లు పోష‌కాలు శ‌రీరంలో క్యాన్సర్ క‌ణాల‌కు వ్యతిరేకంగా పోరాడి వాట‌ిని నాశ‌నం చేస్తాయి.

సో.ఇక‌పై రొయ్య‌లు క‌నిపిస్తే అస్స‌లు వ‌ద‌లొద్దు.

అయితే రొయ్య‌లు మంచివి అన్నాం క‌దా అని చేప‌లు తిన‌డం మానేయ‌కండి.అవీ, ఇవీ.

రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.కాబ‌ట్టి, రెండిటినీ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

స‌మ్మ‌ర్ ఫ్రూట్ మ్యాంగోతో బెస్ట్ వెయిస్ లాస్ స్మూతీ మీకోసం..!