ఇద్దరిలో కేసిఆర్ ను ఓడించేదేవరు ?
TeluguStop.com
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్( Kcr ) రెండు చోట్ల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
తాను ఎప్పుడు పోటీ చేసే గజ్వేల్ తో పాటు ఈసారి కామారెడ్డి నుంచి కూడా కేసిఆర్ పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో రెండు చోట్ల కేసిఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
ఇటు బీజేపీ( BJP ) అటు కాంగ్రెస్ రెండు పార్టీల నేతలు కూడా కేసిఆర్ కు పోటీగా బలమైన నేతలను బరిలో నిలిపేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.
బీజేపీ తరుపున కేసిఆర్ కు పోటీగా గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్( Etela Rajender ) పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.
"""/" /
గత కొన్నాళ్లుగా కేసిఆర్ ను ఢీ కొట్టేందుకు ఈటెల ఉవ్విళ్లూరుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ ను ఒడిస్తానని శపధం చేస్తున్నారు.అందుకే బీజేపీ అధిష్టానం గజ్వేల్ నుంచి ఈటెల ను బరిలో దించింది.
ఇక కాంగ్రెస్( Congress ) విషయానికొస్తే కామారెడ్డిలో కేసిఆర్ కు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డిని బరిలో దించే ఆలోచనలో ఉందట.
రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కోడంగల్ నుంచి పోటీ చేయనున్నారు.అయితే కోడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట.
ఇటీవల స్వయంగా రేవంత్ రెడ్డే ఈ విషయాన్ని స్పష్టం చేశారు.కామారెడ్డిలో కేసిఆర్ ను ఒడిస్తామని, అవసరమైతే తానే కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.
దీంతో అటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు కేసిఆర్ ను ఓడించేందుకు ఈటెల మరియు రేవంత్ రెడ్డి లను బరిలో దించడం ఖాయంగా కనిపిస్తోంది.
"""/" / మరి బిఆర్‌ఎస్( BRS ) అధినేత కు పోటీనిచ్చే సత్తా ఈ ఇద్దరిలో ఉందా అంటే భిన్నబిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
గత కొన్నాళ్లుగా గజ్వేల్ నియోజిక వర్గంలో కేసిఆర్ కు వ్యతిరేక గళం వినిపిస్తోంది.
బిఆర్‌ఎస్ కు చెందిన కొంతమంది కార్యకర్తలు ఇప్పటికే ఈటెల కు మద్దతు తెలిపారు.
దీంతో గజ్వేల్ లో కేసిఆర్ కు ఈటెల రాజేందర్ గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కామారెడ్డి విషయానికొస్తే కాంగ్రెస్ తరుపున షబ్బీర్ అలీ పోటీచేస్తారని మొదటి నుంచి వార్తలు వచ్చాయి కానీ కేసిఆర్ కు పోటీగా రేవంత్ రెడ్డి అయితేనే బెటర్ అని హస్తం పార్టీ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరి ఈటెల, రేవంత్ రెడ్డి.ఇద్దరిలో కేసిఆర్ ను ఢీ కొట్టి నిలిచే సత్తా ఎవరికి ఉందో చూడాలి.
రోజుకే 4 కోట్ల ఆదాయం.. కానీ ఈమెను చూస్తే అందరికీ ఎందుకింత అసహ్యం..?