ఎముక‌ల బ‌లానికి కాల్షియం ఒక్క‌టే స‌రిపోదు..అవీ కావాలి!

ఎముక‌ల బ‌లంగా ఉంటేనే ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌గ‌లం.లేదంటే ఎప్పుడూ ఏదో ఒక స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బ‌ల‌కు ఎముక‌లు విర‌గ‌డం, ఎక్కువ స‌మ‌యం పాటు ఏ ప‌నీ చేయ‌లేక పోవ‌డం, కీళ్లు మ‌రియు మోకాళ్ల నొప్పులు పుట్ట‌డం వంటి వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అందుకే ఎముక‌ల‌ను బ‌లంగా ఉంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అయితే ఎముకల దృఢత్వానికి కాల్షియం ఒక్క‌టే స‌రి పోతుంద‌ని చాలా మంది భావిస్తుంటారు.

కానీ, అలా అనుకోవ‌డం పొర‌పాటే.ఎందుకుంటే ఎముక‌లు గ‌ట్టిగా ఉండాలంటే.

కాల్షియంతో పాటుగా మ‌రి కొన్ని పోష‌కాలు కూడా కావాలి.మ‌రి అవేంటో.

? ఏయే ఆహారాల్లో ఉంటాయో.? ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముక‌ల ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు విట‌మిన్ డి ఒక‌టి.శ‌రీరంలో విట‌మిన్ డి లోపిస్తే ఎముకలు సాంద్రత తగ్గి, బలహీనమవుతాయి.

అందుకే చేప‌లు, పుట్ట‌గొడుగులు, పాలు, గుడ్డు, మాంసం, పన్నీర్ వంటి ఆహారాల‌ను తీసుకోవాలి.

"""/"/ అలాగే ఎముక‌లు దృఢంగా, బ‌లంగా ఉండాలంటే కాల్షియంతో పాటు మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాల‌ను తీసుకోవాలి.

అర‌టి పండు, అవ‌కాడో, న‌ట్స్‌, గుమ్మ‌డి కాయ‌ గింజ‌లు, పాల కూర‌, సోయ‌ బీన్స్‌, బీట్ రూట్‌, చిల‌గ‌డ దుంప‌లు, దానిమ్మ పండ్లు, బొప్పాయి పండ్లు వంటివి తీసుకోవ‌డం ద్వారా మెగ్నిషియం, పొటాషియం పోష‌కాలు శ‌రీరానికి ల‌భిస్తాయి.

ఎముకల్ని బలంగా ఉంచడంలో విటమిన్ కె సైతం కీల‌క పాత్ర పోషిస్తుంది.కాబ‌ట్టి.

బ్రోకోలి, క్యారెట్‌, కివీ, చిక్కుళ్లు, ప‌సుపు, ట‌మాటా, బెర్రీ పండ్లు వంటివి తీసుకుంటే విట‌మిన్ కె పుష్క‌లంగా అందుతుంది.

ఇక ఎముక‌ల దృఢత్వానికి ప్రోటీన్ కూడా అవ‌స‌ర‌మే.అందు వ‌ల్ల‌, రోజూ ప్రోటీన్ స‌మృద్ధిగా ఉంటే వేరుశెన‌గ‌లు, కిడ్నీ బీన్స్‌, చియా సీడ్స్‌, డ్రై ఫ్రూట్స్ త‌దిత‌ర ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

బాహుబలి తీసినట్టు ఫీల్ అవుతున్నావ్.. బలగం డైరెక్టర్ ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నారా?