బోయపాటి తరువాత బాలయ్య దారెటు..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో ముచ్చటగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

దీనికోసం బాలయ్యకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే పవర్‌ఫుల్ స్క్రిప్టును తెరకెక్కిస్తున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది.

ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో బాలయ్య సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తున్నాడు.

ఇప్పటికే సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాతో బి.గోపాల్ మరోసారి తనదైన మార్క్ వేసుకునేందకు రెడీ అవుతున్నాడు.

కాగా తమిళ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో బాలయ్య ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టుకు ఓకే చేశాడట.

అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

బోయపాటి చిత్రం ముగిశాక వెంటనే ఏఎం రత్నంతో సినిమా చేసేందుకు బాలయ్య మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే బి.గోపాల్ సినిమా పరిస్థితి ఏమిటని చిత్ర వర్గాల్లో డైలమా నెలకొంది.

ఏదేమైనా బిబి3 చిత్రం తరువాత బాలయ్య ఎవరికి ఓటేస్తాడా? బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక బోయపాటితో చేస్తున్న సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.