మ‌న ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా?.. ఇప్పుడే తెలుసుకోండి!

పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే విష‌యం అందరికీ తెలిసిందే.

పాలలో చాలా పోషకాలు ఉన్నాయి.అయితే ఆవుపాలు, తీసుకోవాలా? లేక గేదె పాలు తీసుకోవాలా? అనేది చాలామందికి ఉండే సందేహం.

అందుకే ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.గేదె పాలు కంటే ఆవు పాలు తేలికైనవి.

తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి.అలాగే ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి.

పిల్లలకు ఆవు పాలను మాత్రమే ప‌డుతుంటారు.అయితే గేదె పాలను ఎక్కు సేపు నిల్వ‌ ఉంచవచ్చు.

ఆవు పాలలో ఎక్కువ నీరు, తక్కువ ఘనపదార్థాలు ఉంటాయి.గేదె పాలలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటుంది.

ఆవు పాలలో 3-4 శాతం కొవ్వు ఉంటుంది, గేదె పాలలో 7-8 శాతం ఉంటుంది.

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10-11 శాతం ప్రోటీన్ ఉంటుంది. """/"/ కొలెస్ట్రాల్ విష‌యానికొస్తే గేదె పాలలో కొలెస్ట్రాల్ పరిమాణం తక్కువగా ఉంటుంది.

కాబట్టి పీసీఓడీ, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి గేదెపాలు మంచివ‌ని నిఫుణులు చెబుతుంటారు.

ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటే, ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు ఉంటాయి.

సుకుమార్ ఈ ఒక్క విషయాన్ని జయిస్తే పుష్ప 2 భారీ సక్సెస్ ను సాధిస్తుంది…