తెలుగు లో ఈ ముగ్గురిలో ఏ హీరోయిన్ టాప్ అంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో చాలామంది వాళ్లకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం స్టార్ హీరోల సినిమాలో అవకాశాల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక మందాన, పూజా హెగ్డే, శ్రీలీల లాంటి హీరోయిన్లు వరుసగా సినిమాలు చేస్తూ వాళ్లకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకుంటూ టాప్ హీరోయిన్లు గా ముందుకు దూసుకెళ్తున్నారు.

శ్రిలీల( Sreeleela ) అయితే ఇప్పటికే స్టార్ హీరోలందరితో చాలా సినిమాలు కమిట్ అయి ఉంది కాబట్టి తొందరలో ఆవిడ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు పొందడం పక్కా అని ఇప్పటికే చాలామంది సినీ మేధావులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆమె చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ ఆమె క్రేజ్ ఇప్పటికే తార స్థాయిలో ఉంది.

"""/" / ఇక వచ్చే సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ సక్సెస్ లను కొడుతూ టాప్ హీరోయిన్ గా ఎదుగుతూ చాలా తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకునే అవకాశం అయితే ఉంది.

ఇక ఈమెకి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి.

"""/" / ఇక రష్మిక మందాన( Rashmika Mandanna ) గురించి చెప్పాలి అంటే ఆమె ఇప్పటికే తెలుగులో స్టార్ హీరో గా ఉన్న అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఆ సినిమా భారీ విజయ సాధించడంతో ఆవిడకి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ అవకాశాలే వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.

ఈ రెండు సినిమాలతో ఆవిడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతుంది.ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న పరుస సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

ఇక వీళ్ళ తో పాటు గా పూజా హెగ్డే కూడా మంచి సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటుంది.

స్టార్ హీరో ప్రభాస్ నాతో నటించలేదు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ వైరల్!