ఆదివారమంటేనే సెలవు.. అయినప్పటికీ ఆ దేవుడికి పూజ చేసుకోవచ్చు!
TeluguStop.com
చాలా మంది సోమ, గురు, శనివారాల్లోనే ఎక్కువగా పూజలు చేస్తుంటారు.ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ వంటలు వండుకొని హాయిగా కడుపు నింపేసుకుంటారు.
కానీ మరికొంత మందికి అంటే.వారంలో ఆ ఒక్క రోజే సెలవు ఉన్నవారికి పూజ చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంటుంది.
అలాంటి వాళ్లు ఆదివారం రోజు తమ ఇష్టానికి అనుగుణంగా పూజలు చేసుకోవచ్చు.అలా కాకపోయినప్పటికీ.
తమ ఇష్టదైవానికి పూజ కూడా చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.ప్రత్యేకంగా ఆదిత్యుడు, మల్లన్న దేవుడిని పూజించవచ్చు.
ఇతర దేవతలను కూడా పూజించి పండితులను సత్కరించడం లేదా వారికి భోజనపదార్థాలను దానం చేయడం చేయాలి.
దీనివల్ల కంటి రోగాలు, తలకు సంబంధించిన సమస్యలు, కుష్టువ్యాధి, దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయని పండితులు చెబుతుంటారు.
ఆదివారం సూర్యారాధన వల్ల కూడా ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.సూర్యుడికి, ఆదిత్యుడికి పూజ చేస్తే.
ప్రతీ ఆదివారం ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు నెల రోజులు లేదా ఒక సంవత్సరం లేదా మూడేళ్ల పాటు దాన ధర్మాలు చేస్తే.
సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.అలాగే ఆదివారం రోజు సూర్యున్ని పూజించడం ద్వారా ఆయుర్దాయం, ఆరోగ్యం పెరుగుతుంది.
వ్రతమాచరించడం ద్వారా అనారోగ్య సమస్యలు, వ్యాధులను నయం చేసుకోవచ్చు.యోగాలో సూర్య నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
అలాగే ప్రతీ రోజు ఉదయం సూర్యనమస్కారం చేయడం వల్ల మనశ్శాంతితోపాటు ఆరోగ్యం కూడా దక్కుతుందని ప్రతీతి.
అందుకే చాలా మంది రోజూ స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారాలు చేస్తుంటారు.
సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు చేదు అనుభవం.. బూతులు తిట్టించిన యువకులు?