టీ తో పాటుగా అసలు కలిపి తీసుకోకూడని ఆహారాలు ఇవే..!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో టీ( Tea ) ముందు వరుసలో ఉంటుంది.
అందులోనూ భారతీయులకు టీతో విడదీయలేని సంబంధం ఏర్పడింది.ఉదయం లేవగానే గొంతులో ఒక కప్పు వేడివేడి టీ పడందే ఏ పని చేయలేనంతగా పరిస్థితి మారింది.
పైగా టీను లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆరోగ్య నిపుణులు స్వయంగా చెబుతున్నారు.
దీంతో డైట్ లో టీ ను ఒక భాగం చేసుకుంటున్నాను.అయితే తెలిసో తెలియకో చాలా మంది టీ తాగే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా టీ తో పాటు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ఎంతో ప్రమాదకరం.
అటువంటి ఆహారాలు ఏవి.? వాటిని ఎందుకు టీ తో పాటుగా తీసుకోకూడదు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
టీతో పాటు ఆరెంజ్, లెమన్ ( Orange ,Lemon )వంటి సిట్రస్ పండ్లను పొరపాటున కూడా తీసుకోకూడదు.
సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది.ఇది టీలో ఉండే క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
మరియు కడుపును ఉబ్బరంగా మారుస్తుంది.అలాగే చాలా మంది టీతో పాటు బిస్కెట్స్, కేక్స్ మరియు చాక్లెట్స్ వంటివి తింటూ ఉంటాయి.
ఇటువంటి ఎక్కువ చక్కెర ఆహారాలు టీతో పాటుగా తీసుకోవడం వల్ల బ్లెడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి.
ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. """/" /
టీతో పాటు నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీలు తదితర ఆహారాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది.కానీ బజ్జీలు, పకోడీలు వంటి భారీ ఆహారాలతో జత చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందలేదు.
పైగా జీర్ణవ్యవస్థపై అధిక ఒత్తిడి పడుతుంది.దాంతో గ్యాస్, అసిడిటీ( Gas, Acidity ), కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
ఇక ఫ్రూట్స్, పసుపు, పెరుగు, ఐరన్ అధికంగా ఉండే కూరగాయలు, వెల్లుల్లి ఉల్లి వంటి ఘాటైన ఆహారాలను కూడా టీతో పాటుగా తీసుకోకూడదు.
కల్కి సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ వైరల్.. దీపిక రోల్ అలా ఉంటుందంటూ?