మైగ్రేన్ వేధిస్తుందా? అయితే ఈ ఫుడ్స్‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

మైగ్రేన్ త‌ల‌నొప్పి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే స‌మ‌స్య ఇది.

తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాయ‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

పురుషుల‌తో పోలిస్తే స్త్రీల‌లోనే ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.పైగా ఇది ఎంతో బాధ‌క‌ర‌మైన నొప్పిని క‌ల‌గ‌జేస్తుంది.

అందుకే మైగ్రేన్‌తో ఇబ్బంది ప‌డేవారు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

మ‌రి ఆ ఫుడ్స్ ఏంటీ.? వాటికి ఎందుకు దూరంగా ఉండాలి.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా త‌ల‌నొప్పి వ‌చ్చిన‌ప్పుడు.

దాని నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు కాఫీ, చాక్లెట్ వంటివి తీసుకుంటారు.కానీ, మైగ్రేన్‌తో బాధ ప‌డుతున్న‌ప్పుడు మాత్రం వీటిని తీసుకుంటే నొప్పి మ‌రింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మైగ్రేన్ త‌ల‌నొప్పిని తీవ్ర త‌రం చేసే ఫుడ్స్‌లో సిట్రస్ ఫ్రూట్స్ ఒక‌టి.అందుకే నిమ్మ‌, క‌మ‌లా, నారింజ‌, ద్రాక్ష వంటి సిట్ర‌స్ పండ్ల‌ను తీసుకోవ‌డం త‌గ్గిస్తే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

"""/" / అలాగే మైగ్రేన్ త‌ల‌నొప్పితో ఇబ్బంది ప‌డుతున్న వారు చీజ్ తినడం పూర్తిగా మానుకోవాలి.

ఎందుకంటే, చీజ్ స‌మ‌స్య‌ను మ‌రింత పెంచుతాయి.కేక్స్, బ్రెడ్, డోనట్స్, స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

అత్తిపండ్లు, పైనాపిల్ వంటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కానీ, మైగ్రేన్ త‌ల‌నొప్పి ఉన్న‌ప్పుడు మాత్రం వీటిని తీసుకోరాదు.

ఎందుకంటే, ఈ పండ్లు నొప్పిని ఇంకా పెంచుతాయి. """/" / ఇక ఇవే కాకుండా వైన్‌, ఎండిన చేపలు, ఎండు ద్రాక్ష‌, చికెన్, మటన్, రొయ్య‌లు, వెల్లుల్లి, ఉల్లిపాయ, నిల్వ ప‌చ్చ‌ళ్లు, బంగాళ‌దుంప చిప్స్‌ వంటి ఆహారాలు సైతం మైగ్రేన్ త‌ల‌నొప్పిని రెట్టింపు చేస్తాయి.

అందు వ‌ల్ల ఈ ఫుడ్స్‌తో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మళ్లీ జనంలోకి ఏపీ సీఎం జగన్..!